• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NTR 30 UPDATE HINDI STAR SANJAY DUTT TO PLAY A KEY ROLE FOR NTR TRIVIKRAM MOVIE SR

NTR 30 : రంగంలోకి హిందీ సూపర్ స్టార్‌.. త్రివిక్రమ్ భారీ ప్లాన్..

NTR 30 : రంగంలోకి హిందీ సూపర్ స్టార్‌.. త్రివిక్రమ్ భారీ ప్లాన్..

ఎన్టీఆర్ త్రివిక్రమ్ Photo : Twitter

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇటీవల NTR 30 పేరుతో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తాజాగా ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తైన వెంటనే.. ఆయన తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోంది.అందులో భాగంగా ఈ చిత్రం కోసం రాజకీయ నేపథ్యంతో ఓ సామాజిక అంశాన్ని చర్చించనున్నాడు త్రివిక్రమ్. పాన్ ఇండియా లెవెల్‌లో అందరికి అప్పిల్ అయ్యేవిధంగా ఈ సినిమా కథను తయారు చేస్తున్నాడట దర్శకుడు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్‌కు సరిసమానంగా ఆయన పాత్ర ఉండనుందట. ఈ రెండు క్యారెక్టర్స్ పోటాపోటిగా ఉండనున్నాయని తెలుస్తోంది.  ప్రస్తుత రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు