ఎన్టీఆర్‌కు పోటీగా హిందీ స్టార్ హీరోను దించుతున్న త్రివిక్రమ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇటీవల NTR 30 పేరుతో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 14, 2020, 10:39 AM IST
ఎన్టీఆర్‌కు పోటీగా హిందీ స్టార్ హీరోను దించుతున్న త్రివిక్రమ్..
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
  • Share this:
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తాజాగా ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తైన వెంటనే.. ఆయన తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోంది.అందులో భాగంగా ఈ చిత్రం కోసం రాజకీయ నేపథ్యంతో ఓ సామాజిక అంశాన్ని చర్చించనున్నాడు త్రివిక్రమ్. పాన్ ఇండియా లెవెల్‌లో అందరికి అప్పిల్ అయ్యేవిధంగా ఈ సినిమా కథను తయారు చేస్తున్నాడట దర్శకుడు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్‌కు సరిసమానంగా ఆయన పాత్ర ఉండనుందట. ఈ రెండు క్యారెక్టర్స్ పోటాపోటిగా ఉండనున్నాయని తెలుస్తోంది.  ప్రస్తుత రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని చూస్తోంది చిత్రబృందం. ఇక మరో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు విడుదలకానుంది.
Published by: Suresh Rachamalla
First published: April 14, 2020, 9:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading