హోమ్ /వార్తలు /సినిమా /

NTR 30: ఎన్టీఆన్ 30 వీడియోలో ఒకటి మిస్ అయ్యింది... గమనించారా?

NTR 30: ఎన్టీఆన్ 30 వీడియోలో ఒకటి మిస్ అయ్యింది... గమనించారా?

NTR Photo : Twitter

NTR Photo : Twitter

ఎన్టీఆర్ 30 వీడియోలో ఎన్టీఆర్ గంభీరమైన డైలాగ్ తో సాగిన మోషన్ పోస్టర్ వీడియో అంతకు మించిన విజువల్స్ కలిగి ఉంది.

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా తాను తీయబోయే రెండు సినిమాలకు సంబంధించి అదిరిపోయే ట్రీట్ అందించాడు. ఎన్టీఆర్ 30 కొరటాల డైరెక్షన్‌లో వస్తున్న విషయం తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ గంభీరమైన డైలాగ్ తో సాగిన మోషన్ పోస్టర్ వీడియో అంతకు మించిన విజువల్స్ కలిగి ఉంది. ''అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూదని... అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని... వస్తున్నా'' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేది. డైలాగ్ లో కొరటాల మార్క్ స్పష్టంగా కనిపించింది.

మొత్తంగా 47 సెకెన్ల మోషన్ పోస్టర్ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి. ఇక అనిరుధ్ బిజీఎం సరికొత్తగా, మరో ఆకర్షణగా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో నాలుగు భాషల్లో మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వీడియోలో అభిమానులు ఓ విషయాన్ని గుర్తించి ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు.ఈ వీడియోలో దర్శకుడు కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌ల పేర్లు మనకు కనిపించాయి. కానీ ఈ సినిమాలో తారక్ సరసన చేయబోయే హీరోయిన్ పేరు మాత్రం కనిపించలేదు. నిజానికి ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా బాలీవుడ్ భామ ఆలియా భట్‌ను తీసుకున్నారు చిత్ర యూనిట్. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడంతో, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి చిత్ర వర్గాలు.

మరోవైపు ఎన్టీఆర్ 30తో పాటు...31 సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా తారక్ బర్త్ డే రోజునే విడుదల చేశారు. ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. మేకర్స్ NTR31 నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. గ్రే మోడ్ లో ఉన్న పోస్టర్ దడపుట్టిస్తోంది. ఊర మాస్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు.  భారీ మీసాలు, గడ్డంతో ఎన్టీఆర్ గంభీరంగా చూసే చూపు వణుకుపుట్టిస్తోంది.

First published:

Tags: Jr ntr, NTR 30

ఉత్తమ కథలు