• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NTR 30 OFFICIAL CONFIRMATION IS OUT AND KORATALA SIVA JOINING HANDS WITH TARAK AGAIN PK

NTR 30 - Koratala Siva: తప్పుకున్న త్రివిక్రమ్.. తెరపైకి కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్..

NTR 30 - Koratala Siva: తప్పుకున్న త్రివిక్రమ్.. తెరపైకి కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్..

జూనియర్ ఎన్టీఆర్ 30 (NTR 30)

NTR 30 - Koratala Siva: ఉగాది ముందు రోజే ఎన్టీఆర్(Jr NTR) తర్వాత సినిమాపై కన్ఫర్మేషన్ వచ్చింది. రాజమౌళి(Rajamouli) తర్వాత ఈయన తర్వాతి సినిమా కొరటాల శివ(Koratala Siva) చేయబోతున్నాడు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్(NTR Arts), యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

  • Share this:
ఉగాది ముందు రోజే ఎన్టీఆర్ తర్వాత సినిమాపై కన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ని రోజులు ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ అది కాదు.. మరో దర్శకుడు లైన్‌లోకి వచ్చాడని జూనియర్ ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేసాడు. రాజమౌళి తర్వాత ఈయన తర్వాతి సినిమా కొరటాల శివ చేయబోతున్నాడు. కొన్ని రోజుల నుంచి ఈ కాంబినేషన్‌పై కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాన్నే నిజం చేస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన ఈ జంట.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. వాళ్లు కూడా ఇదే చెప్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్‌లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామని స్పష్టం చేసాడు కొరటాల శివ. మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతుండటం హ్యాపీగా ఉందన్నాడు ఈయన. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.

కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా ఉన్నాడు. ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ఈయన చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు.


ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. కరోనా కారణంగా మరోసారి ఈ చిత్రం వాయిదా పడింది. ఎప్రిల్‌లోనే చిత్ర షూటింగ్ పూర్తి చేయనున్నాడు కొరటాల. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా కమిటయ్యాడు కొరటాల. అయితే ఈ చిత్రం కొన్ని రోజులు పక్కనబెట్టి ముందు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేయనున్నాడు కొరటాల శివ. మరోవైపు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమాను కొరటాల తర్వాత పట్టాలెక్కించబోతున్నాడు. ఏదేమైనా కూడా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబో ఎలా ఉండబోతుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు