హోమ్ /వార్తలు /సినిమా /

NTR 30: ఎన్టీఆర్‌‌ కొరటాల సినిమాలో బాలీవుడ్ హాట్ బాంబ్.. ?

NTR 30: ఎన్టీఆర్‌‌ కొరటాల సినిమాలో బాలీవుడ్ హాట్ బాంబ్.. ?

Photo Twitter

Photo Twitter

ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్‌గా ఆలియా భట్ అనుకున్నారు. ఆలియా కూడ అదే చెప్పింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో త్వరలో ఎన్టీఆర్‌తో సినిమా తీస్తున్నట్లు పేర్కొంది

ఆర్ఆర్ఆర్ (RRR)సక్సెస్‌తో ఫుల్ ఫాంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr).. ఇప్పుడు సినిమాలని వరుసగా లైన్‌లో పెట్టాడు. ఇటు కొరటాల, అటు ప్రశాంత్ నీల్‌తో వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 30 టైటిల్‌తో కొరటాల మూవీ తీస్తున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ గంభీరమైన డైలాగ్ తో సాగిన మోషన్ పోస్టర్ వీడియో అంతకు మించిన విజువల్స్ కలిగి ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ పై అనేక పేర్లు తెరపైకి వచ్చాయి.

ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్‌గా ఆలియా భట్ అనుకున్నారు. ఆలియా కూడ అదే చెప్పింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో త్వరలో ఎన్టీఆర్‌తో సినిమా తీస్తున్నట్లు పేర్కొంది. అయితే అనుకోకుండా ఆలియా భట్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకుంది. ప్రియుడు రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకున్నాక... బిజీ అయిపోయింది. అటు బాలీవుడ్‌లో కూడా కొన్ని ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండటంతో ప్రస్తుతం ఆలియా ఆ పనిలో ఉంది.దీంతో ఆలియాకు బదులు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఇదో పాన్ ఇండియా సినిమా కాబట్టి.. హిందీలో మంచి మార్కెట్, క్రేజ్ ఉన్న భామనే తీసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్ తెరమీదకొచ్చింది. ఆ తర్వాత జాన్వీని అసలు సంప్రదించలేదని తెలిసింది.

ఇక జాన్వీ తర్వాత... సాయిపల్లవి, శ్రద్ధకపూర్ ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఎవరి విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ హాట్ బాంబ్... దిశా పటాని పేరు ఇప్పుడు తాజాగా వినిపిస్తోంది. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది దిశా పటాని. దీంతో ఈ హీరోయిన్‌ను తీసుకునేందుకు మేకర్ భావిస్తున్నారని సమాచారం. ఈమెని ఎంపిక చేస్తే, మార్కెట్ పరంగా బాలీవుడ్‌లో కలిసొస్తుందని, గ్లామర్ కూడా తోడవుతుందని మేకర్స్ ఉద్దేశం. అయితే, ఇది నిజమా? కాదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. మరి దిశ పటాని పేరు అయినా ఖరారు అవుతుందో లేదో చూడాలి.

First published:

Tags: Disha Patani, Jr ntr, NTR 30

ఉత్తమ కథలు