NTR 30 - Koratala Siva: ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ మరో కథానాయకులుగా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించారు. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీళ్లిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. వాళ్లు కూడా ఇదే చెప్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామని స్పష్టం చేసారు కొరటాల శివ. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా అని కన్ఫామ్ చేసారు కొరటాల శివ. ప్యాన్ ఇండియ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొరటాల శివ ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.
కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఆ లోపు ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అతని పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఇంకో వారం రోజుల షూటింగ్‌తో ఈ సినిమా కంప్లీట్ అవుతోంది.
ఎన్టీఆర్‌తో రెండోసారి తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ పొలిటికల్ అండ్ కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ తరహా స్టూడెంట్స్ రాజకీయాలతో వాళ్ల విలువైన జీవితం కోల్పోకూడదనే అమూల్యమైన సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సమకాలీన రాజకీయా అంశాలతో ఈ సినిమా కథను రెడీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ సినిమాలో సీఎం కుమారుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తే.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను మాత్రం ఒక విద్యార్ధి నాయకుడు ఎలా రాజకీయాల్లో వచ్చి అంచలంచెలుగా ఎలా ఎదగడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించబోతున్నట్టు సమాచారం. రేపు కొరటాల శివ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ఈమె గతంలో కొరటాల శివ సినిమా ‘భరత్ అను నేను’సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే కదా. అందుకే ఇపుడు మరోసారి కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ సరసన యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు కియారాకు బాగానే ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం.
కియారా కాకుండా ఈ చిత్రంలో మరో కథానాయికకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఏదేమైనా కూడా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబో ఎలా ఉండబోతుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Kalyan Ram Nandamuri, Kiara advani, Koratala siva, NTR Arts, Telugu Cinema, Tollywood