హోమ్ /వార్తలు /సినిమా /

శ్రీదేవి తనయ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. స్టార్ హీరో సినిమాలో జాన్వీ కపూర్!

శ్రీదేవి తనయ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. స్టార్ హీరో సినిమాలో జాన్వీ కపూర్!

Photo twitter

Photo twitter

Ntr 30: తన కథతో జాన్వీ కపూర్‌ని మెప్పించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారనే టాక్ ఫిలిం నగర్‌లో బలంగా వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఆయన చేయబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఎన్టీఆర్ 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంతో జాన్వి టాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ అయిందని అంటున్నారు.

ఇంకా చదవండి ...

శ్రీదేవి తనయ (Sridevi Daughter) జాన్వీ కపూర్ ( Janhvi Kapoor) టాలీవుడ్ ఎంట్రీ (Tollywood Entry) గురించి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వార్తలు వస్తూనే ఉంటాయి కానీ ఇప్పటిదాకా జాన్విని తెలుగు తెరపై చూసింది లేదు. సౌత్ సినిమాలపై తనకు ఇంట్రస్ట్ ఉందని చెబుతున్న జాన్వీ కపూర్.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కుతున్నా రిజెక్ట్ చేస్తూ వస్తోందట. ఈ నేపథ్యంలో తన కథతో ఆమెను మెప్పించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva), జాన్వీ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారనే టాక్ ఫిలిం నగర్‌లో బలంగా వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Jr Ntr)తో ఆయన చేయబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఎన్టీఆర్ 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంతో జాన్వి టాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ అయిందని అంటున్నారు.

నందమూరి వారసుడిగా ప్రేక్షక మన్ననలు పొందుతున్న ఎన్టీఆర్.. రీసెంట్‌గా RRR రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకొని ఇప్పుడు కొరటాల ప్రాజెక్టుతో బిజీ అయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా హీరోయిన్ విషయమై రోజుకో పేరు బయటకొస్తోంది. ఇప్పటి వరకు రష్మిక మందన్నాతో పాటు ఆలియా భట్, కియారా అద్వానీ, దిశా పటానీ, అనన్య పాండే పేర్లు తెరపైకి రాగా తాజా బజ్‌ ప్రకారం ఈ సినిమాలో జాన్వీ కపూర్‌‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. గ్రాండ్‌గా ఆమె ఎంట్రీ ఉండేలా కొరటాల సన్నాహాలు చేస్తున్నారట.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని, ఇందుకోసం సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్- సాయి పల్లవి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారని, ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్పులతో థియేటర్స్ హోరెత్తిపోయేలా కొరటాల ప్లాన్ రెడీ చేశారని సమాచారం. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓ పల్లెటూరు యువకుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడనే లైన్‌తో తెరకెక్కించబోతున్నారట.

గతంలో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీ సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచి ఈ మూవీ అప్‌డేట్స్ వేట మొదలుపెట్టారు. పొలిటికల్ టచ్‌తో రాబోతున్న ఈ కథ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ కావాలని కొరటాల బలంగా ఫిక్సయ్యారట. సో.. చూడాలి మరి ఎన్టీఆర్ 30ని ఎలా ప్రేక్షకుల ముందుంచుతారనేది!.

First published:

Tags: Janhvi Kapoor, Jr ntr, Koratala siva, NTR 30

ఉత్తమ కథలు