NTR@20Years: 20 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్టీఆర్ కెరీర్‌లో అదొక్కటే లోటు..

ఎన్టీఆర్ (Twitter/Photo)

NTR@20Years: 20 నట ఏళ్ల ప్రస్థానంలో ఎన్టీఆర్ కెరీర్‌లో అదొక్కటే లోటు.. వివరాల్లోకి వెళితే..  తెలుగు ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

  • Share this:
    NTR@20Years: 20 నట ఏళ్ల ప్రస్థానంలో ఎన్టీఆర్ కెరీర్‌లో అదొక్కటే లోటు.. వివరాల్లోకి వెళితే..  తెలుగు ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో 30 సినిమాలకు చేరువైన ఎన్టీఆర్... ఆయన కెరీర్‌లో యాక్ట్ చేసిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. తారక్ చిన్నపుడు రామాయణం సినిమాలో రాముడిగా తన ఫిల్మ్ కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత ‘నిన్ను చూడాలని’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యాడు.ఈ సినిమా షూటింగ్ సరిగ్గా ఇరవై యేళ్ల క్రితం నవంబర్ 16న ఇదే రోజున ప్రారంభమైంది.

    హీరోగా ఎన్టీఆర్ కెమెరా ముందుకు వచ్చి నేటితో 20 యేళ్లు పూర్తి (Twitter/Photo)


    తారక్ విషయానికొస్తే.. ఒకసారి కేరేక్టర్‌లోకి వెళ్లాడంటే.. యాక్షన్‌లో పర్ఫెక్షన్.. డైలాగ్స్‌లో ఎమోషన్, మూమెంట్స్‌లో ఒక రకమైన రిథమ్ కంపల్సరీ. రూపంలో తాత పోలికలే కాదు. అభినయంలోను ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు జూనియర్. తనకు నచ్చిన పాత్ర వస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆ రోల్ అంతం చూడటంలో తాతలాగే మొండిఘటం. అంతే కాదు బాబాయ్ బాలకృష్ణలా యాక్షన్ సీన్స్‌లో తొడకట్టగలనని  ప్రూవ్ చేసుకున్నాడు. ఐతే.. జూనియర్ ఎన్టీఆర్.. మొదటిసారి మొఖానికి రంగేసుకుంది సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’. ఈ సినిమాలో తారక్.. భరతుడి క్యారెక్టర్ చేసాడు.

    తాత ఎన్టీఆర్ హీరోగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌‌తో ముఖానికి మేకప్ వేసుకున్న తారక్.. హిందీ విశ్వామిత్ర విడుదల కాలేకపోయింది. (Facebook/Photo)


    తెలుగు వెర్షన్ బ్రహ్మర్షి విశ్వామిత్రా సినిమాలో  బాలకృష్ణ.. హరిశ్చంద్రుడు, దుశ్శంతుడుగా వేసాడు. హిందీలో కూడా అదే వేషం వేసాడు. ఈ చిత్రంలో దుశ్శంతుడు కొడుకైన భరతుడిగా చిన్న ఎన్టీఆర్ యాక్ట్ చేసాడు.మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో ఎన్టీఆర్ హిందీని అనర్గళంగా మాట్లాడం చూసి పెద్ద ఎన్టీఆర్ హిందీ వెర్షన్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ సినిమాలో ఎన్టీఆర్‌ను తీసుకున్నారు. కానీ తెలుగులో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో హిందీ వెర్షన్‌కు సంబంధించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీటైన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ చిత్రాన్ని అన్నగారు ఈ చిత్రాన్ని హోల్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత పెద్ద ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ కావడం వంటి కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాకుండా పెద్ద ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం విశేషం. ఈ రకంగా నందమూరి కుటుంబంలో ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం యాదృచ్ఛికమనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: