NTR 100TH BIRTH ANNIVERSARY CHIRANJEEVI TRIBUTE TO LEGENDARY ACTOR NTR BIRTH ANNIVERSARY TA
NTR Jayanthi - Chiranjeevi: అన్న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక నివాళులు..
ఎన్టీఆర్‌కు చిరంజీవి నివాళులు (Twitter/Photo)
NTR Jayanthi - Chiranjeevi: ఈ రోజు మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ ఎన్టీఆర్ శత జయంతి. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
NTR Jayanthi - Chiranjeevi: వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్ శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ కోవలో మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా అన్నగారి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, నవరస నటనా సార్వాభౌముడు, తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడికి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి అంటూ రాసుకొచ్చారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి.. అన్నగారితో కలిసి ‘తిరుగులేని మనిషి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు నందమూరి, మెగా హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. ఇక చిరంజీవి రీసెంట్గా తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాతో పలకరించారు.
తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2022
అన్నగారు కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో అతి తక్కువ సమయంలోనే సంచలనం సృష్టించారు. 13 యేళ్లు రాజకీయ జీవితంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. సినిమాల్లో పౌరాణిక పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు ఎన్టీఆర్.నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా...రాజకీయ వేత్తగా....ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలుపించుకున్న మహానటుడు ఎన్టీఆర్.
నాటకాలతో అప్పటికే మంచి నటుడిగా గుర్తింపు పొందారు రామారావు. అతనిలోని నటుడ్ని గుర్తించిన ప్రముఖ దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు ‘పల్లెటూరిపిల్ల’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో ‘మనదేశం’ సినిమా లో అవకాశం రావడంతో దానిలో నటించారు. అలా.. ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం ‘మనదేశం’ అయింది.ఇక ద్విపాత్రాభినయం కలిగిన చిత్రాలు 32 సార్లు చేసారు. తన స్వీయ దర్శకత్వంలోనే 18 సార్లు నటించిన ఘనత కూడా ఎన్టీఆర్కే దక్కుతుంది. ‘నా దేశం’ చిత్రం యన్టీఆర్ నటించిన ఆఖరి మాస్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తరువాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.