NOW TOLLYWOOD ALSO DEPENDS ON JABARDASTH COMEDY SHOW COMEDIANS NK
టాలీవుడ్లో జబర్దస్త్ కామెడీ షో... ఇక పంచ్‌ల తుఫానే
జబర్దస్త్ కామెడీ షో...
Jabardasth Comedy Show : జబర్దస్త్ కామెడీ షో వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అలాంటి షో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవడమే కాదు... టాలీవుడ్‌కీ కృష్ణానగర్‌గా మారిపోయింది.
Jabardasth Comedy Show :తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి గురు, శుక్రవారాలంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ రోజు నవ్వులు పూయించే జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో వస్తాయి. ఈ రెండ్రోజుల్లో వచ్చే కామెడీ షోను యూట్యూబ్‌లో చూసేందుకు లక్షల మంది ఎదురుచూస్తారు. షో ఇలా అప్లోడ్ కాగానే... అలా గంటకు 2లక్షల మంది దాకా చూస్తున్నారు. ఇంతలా జబర్దస్త్ కామెడీ షో... తెలుగు ప్రజలకు బాగా నచ్చేసింది. ఈ షోలో కూడా... హైపర్ ఆది స్కిట్లు ఆ తర్వాత... సుడిగాలి సుధీర్ బ్యాచ్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ స్కిట్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌కి తగ్గట్లే... అందులోనీ టీమ్ లీడర్లకూ, నటులకూ ఇప్పుడు టాలీవుడ్లో మంచి ఆఫర్లు, అవకాశాలూ వస్తున్నాయి.
ఒకప్పుడు టాలీవుడ్లో ఆఫర్ల కోసం కాళ్లరిగేలా తిరిగిన ఎంతో మంది నటీనటులకు ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షో... ఓ ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఇందులో కాస్తో, కూస్తో పేరు తెచ్చుకుంటే చాలు... ఏదో ఒక సినిమాలో ఛాన్స్ దక్కుతోంది. ఇక హైపర్ ఆది, రాకెట్ రాఘవ, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి వాళ్లు రెగ్యులర్‌గా సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా చమ్మక్ చంద్ర... రామ సక్కనోళ్లు సినిమాలో లీడ్ రోల్ చేస్తూ... వెండితెరపై హీరోగా కనిపించబోతున్నాడు. ఇక సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్... కలిసి త్రీ మంకీస్ సినిమా చేస్తున్నారు. ఇక యాంకర్లైన అనసూయ, రష్మీ గౌతమ్ ఇప్పటికే చాలా సినిమాల్లో చేశారు, చేస్తున్నారు కూడా. జడ్జిలైన నాగబాబు, ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు వద్దన్నా టాలీవుడ్ వాళ్లను వదలదు. ఒకప్పుడు టాలీవుడ్లోకి ఎంటర్ అవ్వడమే పెద్ద సవాలయ్యే పరిస్థితుల నుంచీ... నేడు టాలీవుడ్‌నే తమవైపు తిప్పుకునే స్థాయికి జబర్దస్త్ నటీనటులంతా ఎదిగారంటే... అందుకు జబర్దస్త్ కామెడీ షో వేసిన బలమైన ప్లాట్‌ఫామే కారణమనుకోవచ్చు.
ఇప్పుడు టాలీవుడ్ కూడా జబర్దస్త్ కామెడీ షోపై ఆధారపడుతుండటం మరో విశేషం. ఒకప్పుడు తమ సినిమాల్లోకి నటీనటులు కావాలంటే... దర్శకులు... కృష్ణానగర్‌లో వెతికేవారు. ఇప్పుడలా కాదు. మెయిన్ రోల్స్ కాకుండా... ఇతరత్రా కేరక్టర్ ఆర్టిస్టులు కావాలంటే... వెంటనే జబర్దస్త్ కామెడీ షోలో చేస్తున్న నటులను ఎంచుకుంటున్నారు. కాస్త చిన్న సినిమాల దర్శకులైతే... నటీనటుల ఎంపిక కోసం ఫస్ట్ ఆప్షన్‌గా జబర్దస్త్ కామెడీ షోవైపే చూస్తున్నారు. ఎందుకంటే... ఈ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్న నటులు దాదాపు 200 మంది దాకా ఉన్నారు. వీళ్లంతా నటనలో ఆరితేరిన వాళ్లే. అందువల్ల వీళ్లను తీసుకుంటే... తక్కువ రెమ్యునరేషన్‌కే... ఎక్కువ నటనా చాతుర్యాన్ని పొందొచ్చని టాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. పైగా వీళ్లకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండటంతో... వాళ్లంతా వీళ్ల సినిమాలకు సపోర్ట్ చేస్తారన్న ఆలోచన ఉంది. కొత్తవాళ్లను తీసుకుంటే... వాళ్లు సరిగా నటించకపోతే... ఎక్కడ లేని ఇబ్బంది. అదే వీళ్లైతే... ఇలా చెప్పగానే సీన్... అలా అల్లుకుపోతారన్న భావన టాలీవుడ్లో ఉంది. అందుకే... టాలీవుడ్ ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోవైపు చూస్తోంది.
ఇన్నాళ్లూ సినిమాల్లో లీడ్ రోల్స్ చెయ్యని జబర్దస్త్ నటులు... ఇప్పుడు టాలీవుడ్లో తమ సత్తా చూపేందుకు వస్తున్నారు. తమ పంచ్‌లతో కిర్రాక్ పుట్టించేందుకు ప్రయత్నిస్తున్నా్రు. ఇప్పటికే హైపర్ ఆది ఇలాంటి కొన్ని ప్రయోగాలు చేశాడు. ఇస్మార్ట్ శంకర్‌లో గెటప్ శ్రీను ఆటో డ్రైవర్‌గా పాత్రలో ఒదిగిపోయాడు. మున్ముందు వీళ్లంతా టాలీవుడ్లో మరిన్ని క్రేజీ ఆఫర్లు సంపాదించుకునే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి. అందువల్ల జబర్దస్త్ వీళ్లకు లైఫ్ ఇచ్చింది. అలాగే... టాలీవుడ్‌కి వీళ్లు... క్రేజీ ఆర్టిస్టులుగా కనిపిస్తున్నారనుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.