రాజమౌళి చెక్కిన బాహుబలి రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు..

జక్కన్న చెక్కిన బాహుబలి సినిమా (Twitter/Photo)

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని దేశ వ్యాప్తంగా నలుదిశలా వ్యాప్తి చేసిన సినిమా ‘బాహుబలి’. ఒకే కథను  రెండు భాగాలుగా తెరకెక్కించడమే ఓ సాహసం. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు.

  • Share this:
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని దేశ వ్యాప్తంగా నలుదిశలా వ్యాప్తి చేసిన సినిమా ‘బాహుబలి’. ఒకే కథను  రెండు భాగాలుగా తెరకెక్కించడమే ఓ సాహసం. ఆ సాహసంతోనే ‘బాహుబలి’ ..ది బిగినింగ్’ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న దానిపై ఆసక్తి రేకెత్తించేలా చేసి.. సెకండ్ పార్ట్ ‘బాహుబలి.. ది కంక్లూజన్’ పై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో  అంచనాలు పెంచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు రాజమౌళి. అంతేకాదు ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ దగ్గర అపూర్వ విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ,సత్యరాజ్, నాజర్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనే సంచలన విజయాన్ని నమోదు చేసింది.

బాహుబలిలో ప్రభాస్‌తో అనుష్క


2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ సినిమా సినీ విమర్శకులను సైతం మెప్పించింది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 1800 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా.. ఆ సినిమా రికార్డును తెలుగుతో పాటు హిందీలో ఏ సినిమా క్రాస్ చేయలేకపోయింది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినిమా ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ‘బాహుబలి 2’ పది రోజుల్లోనే దేశ వ్యాప్తంగా కేవలం హిందీలోనే  రూ. 300 కోట్లు రాబట్టింది. నేటికీ ఆ రికార్డు ఎవరు క్రాస్ చేయలేకపోయారు.ఈ సందర్భంగా ‘బాహుబలి 2’ విడుదల తర్వాత  ఏ హిందీ సినిమా.. ఎన్ని కోట్లు వసూలు చేసిందనే విషయాన్ని షేర్ చేశారు. 2019లో విడుదలైన హిందీ సినిమాలు ‘వార్’ వారం రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. అదే  ‘కబీర్ సింగ్’ విషయానికొస్తే.. 13 రోజుల్లో రూ.200 ఫీట్ అందుకుంది. సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీ రూ.200 కోట్ల క్లబ్బులో చేరడానికి 14 రోజుల సమయంల తీసుకుంటే.. ‘ఉరి’ సినిమా రూ.200 కోట్లు వసూలు చేయడానికి 28 రోజుల సమయం పట్టింది. అక్షయ్ కుమరా్ ‘మిషన్ మంగళ్’ సినిమా 29  రోజుల్లో రూ.200 క్లబ్బులో చేరాయని పేర్కొన్నాడు.అదే విధంగా హిందీలో గత కొన్నేళ్లుగా రూ.200 కోట్ల క్లబ్బులో చేరిన సినిమాల విషయానికొస్తే.. ‘సంజు’  ‘టైగర్ జిందా హై’ ‘సుల్తాన్’ సినిమాలు ఏడు రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్బులో చేరాయి. అటు ఆమీర్ ఖాన్..‘దంగల్’, ‘పీకే’ సినిమాలు ఎనిమిది రోజుల్లో రూ. 200 కోట్లు వసూలు చేశాయి. సల్మాన్..‘భజరంగీ భాయిజాన్’ మాత్రం తొమ్మిది రోజుల్లో దేశ వ్యాప్తంగా రూ.200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టాయన్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published: