టాలీవుడ్ అంటే తెలుగు ఇండస్ట్రీ కాదు.. ఇండియాలో మరో ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అని పిలుస్తారు.. అదే బెంగాలీ ఇండస్ట్రీ. అక్కడి సినిమాలను కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. ఇప్పుడు అక్కడ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు అభిషేక్ ఛటర్జీ కన్నుమూసారు. కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. బెంగాలిలో 100కి పైగా సినిమాల్లో నటించారు ఈయన. ఇప్పటికీ బిజీగా ఉన్నాడు.. చాలా డిమాండ్ ఉన్న కారెక్టర్ ఆర్టిస్ట్ ఈయన. అభిషేక్ మృతితో బెంగాలి చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1986లో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. దాదాపు 120 సినిమాలకు పైగానే నటించారు. కొన్ని బంగ్లాదేశీ సినిమాలు కూడా చేసారు ఈయన. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో మార్చ్ 24 ఉదయం కన్నుమూసారు.
ఈయన మరణానికి అసలు కారణం ఇంకా బయటపడలేదు. కుటుంబ సభ్యులు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని చూస్తున్నారు. అంత్యక్రియల గురించి కూడా కీలక సమాచారం ఇవ్వనున్నారు. 1985లో పాత్‌భోలా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు అభిషేక్ ఛటర్జీ.
అక్కడ్నుంచి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఓరా చార్జోన్, తుమీ కోటో సుందర్, సురర్ ఆకాశే, తూఫాన్, మర్యాద, అమర్ ప్రేమ్ లాంటి సినిమాల్లో అభిషేక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. టీవీలో కూడా తనదైన ముద్ర వేసాడు అభిషేక్ ఛటర్జీ. ఎన్నో వందల సినిమాల్లో అలరించిన నటుడు కళ్ల ముందు లేడనే విషయాన్ని తెలుసుకుని బాధ పడుతున్నారు అభిమానులు. బెంగాలీ నటీనటులు, టెక్నీషియన్స్ కూడా అభిషేక్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengali cinema