తమిళ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత..

Vadivel Balaji: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేల్ బాలాజీ కన్నుమూసాడు. ఈయన వయసు 42 సంవత్సరాలు మాత్రమే. కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంగానే ఉన్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2020, 3:30 PM IST
తమిళ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత..
తమిళ హాస్య నటుడు వడివేల్ బాలాజీ కన్నుమూత (vadivel balaji)
  • Share this:
ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేల్ బాలాజీ కన్నుమూసాడు. ఈయన వయసు 42 సంవత్సరాలు మాత్రమే. కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంగానే ఉన్నాడు. పరిస్థితి విషమించడంతో ఈయన మృతి చెందాడు. సెప్టెంబర్ 10 ఉదయం ఈయన చెన్నై ప్రభుత్వాసపత్రిలో తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వడివేల్ బాలాజీకి గుండెపోటు రావడంతో ఆయనను చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. గత 15 రోజులుగా వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
తమిళ హాస్య నటుడు వడివేల్ బాలాజీ కన్నుమూత (vadivel balaji)
తమిళ హాస్య నటుడు వడివేల్ బాలాజీ కన్నుమూత (vadivel balaji)

అయితే ఆర్థిక స్థోమత బాగోలేకపోవడంతో హాస్పిటల్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితికి వచ్చేసారు కుటుంబ సభ్యులు. దాంతో ప్రైవేట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు. అక్కడి నుంచి మరో విధి లేక ఈయన్ని ప్రభుత్వాసపత్రిలో చేర్పించారు. అక్కడ బాలాజీని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా కూడా ఫలించలేదు. దాంతో ఆయన ప్రాణాలు విడిచారు. కొన్ని తమిళ సినిమాల్లో బాలాజీ నటించాడు.. దాంతో పాటు విజయ్ టీవీలో వచ్చే ఓ కామెడీ షోతో ఆయన పాపులర్ అయ్యాడు. అందులో వడివేలును ఆయన బాగా అనుకరించేవాడు.. అందుకే బాలాజికి వడివేల్ బాలాజీ అనే పేరు వచ్చింది. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.
Published by: Praveen Kumar Vadla
First published: September 10, 2020, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading