• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NOTED TAMIL ACTOR TS RAGHAVENDRA DIES AT 75 AND KOLLYWOOD PAYS TRIBUTE PK

ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో అభిమానులు..

ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో అభిమానులు..

టిఎస్ రాఘవేంద్ర మరణం (ts raghavendra death)

TS Raghavendra Death: తమిళంలో సుపరిచితుడైన ప్రముఖ నటుడు, గాయకుడు టీఎస్‌ రాఘవేంద్ర కన్నుమూశారు. ఈయన వయసు 75 సంవత్సరాలు. ఎన్నో సినిమాల్లో నటించారు రాఘవేంద్ర.

  • Share this:
ఈ మధ్య వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న తెలుగు నటుడు జాన్ కొట్టోలి కన్నుమూసాడు. ఈయన మరణించి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మరో చేదు వార్త వచ్చింది. తమిళంలో సుపరిచితుడైన ప్రముఖ నటుడు, గాయకుడు టీఎస్‌ రాఘవేంద్ర కన్నుమూశారు. ఈయన వయసు 75 సంవత్సరాలు. ఎన్నో సినిమాల్లో నటించారు రాఘవేంద్ర. కొన్ని రోజులుగా వయోభారంతో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో జనవరి 30న స్వగృహంలోనే మరణించారు. తెలుగులో తక్కువ కానీ తమిళనాట మాత్రం రాఘవేంద్రకు చాలా ఇమేజ్ ఉంది.. మంచి గుర్తింపు కూడా ఉంది.
టిఎస్ రాఘవేంద్ర మరణం (ts raghavendra death)
టిఎస్ రాఘవేంద్ర మరణం (ts raghavendra death)

ఈయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం కేకే నగర్‌లోని నివాసంలో ఉంచిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాఘవేంద్ర మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగులో కూడా ఈయన మంచి సినిమాల్లో నటించారు. నటి సుహాసినికి అప్పట్లో అవార్డులు తీసుకొచ్చిన సింధు భైరవి సినిమాలో ఆమెకు తండ్రిగా నటించారు రాఘవేంద్ర. రేవతి నటించిన వైదేహి కాత్రిరుందల్‌ సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. విక్రం, హరిశ్చంద్ర, నీ వేరువై ఎన తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన నటించిన చివరి చిత్రం పోన్‌ మేఘాలై 2005లో విడుదలైంది. నటుడిగానే కాకుండా గాయకుడిగా, స్వరకర్తగా రాఘవేంద్ర గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మరణంపై తెలుగు పరిశ్రమ కూడా సంతాపం తెలియజేసింది.
Published by:Praveen Kumar Vadla
First published: