కరోనా వైరస్ ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెల రోజులుగా అక్కడ మరణ మృదంగం మోగుతుంది. 15 రోజుల కింద కమెడియన్ వడివేల్ బాలాజీ కన్నుమూసాడు.. ఆ తర్వాత మొన్నటికి మొన్న ప్రముఖ దర్శకుడు బాబుశివన్ మరణించాడు. అయితే వాళ్లిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. ఇప్పుడు మరో తమిళ నటుడు కూడా మరణించాడు.

తమిళ నటుడు రూబెన్ జే (actor ruben jay)
అతడి పేరు రూబెన్ జే.. ఈయన కరోనాతో కన్నుమూయడం విషాదం. రూబెన్ వయస్సు 54 సంవత్సరాలు. కొన్ని రోజులుగా లంగ్ క్యాన్సర్ సోకి చికిత్స పొందుతున్న ఈయనకు కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. దాంతో సెప్టెంబర్ 21న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడని.. అందుకే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించామని సన్నిహితులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రూబెన్ జే.

తమిళ నటుడు రూబెన్ జే (actor ruben jay)
ఈయన అప్పట్లో విక్రమ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ధూల్‌తో పాటు ఒక్కడు రీమేక్ గిల్లీలోను నటించాడు. దాంతో మరికొన్ని సినిమాల్లో కూడా నటించాడు రూబెన్. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు.. కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్‌గా కూడా పని చేసాడు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Published by:Praveen Kumar Vadla
First published:September 22, 2020, 18:48 IST