• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NOTED TAMIL ACTOR AND DIRECTOR VISU DIES AT 74 AND CELEBS PAYS RESPECT PK

ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో సౌత్ ఇండస్ట్రీ..

ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో సౌత్ ఇండస్ట్రీ..

నటుడు విసు కన్నుమూత (actor visu death)

Visu Death: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు విసు కన్నుమూసారు. కొన్ని రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధ పడుతున్న ఆయన మార్చ్ 22 సాయంత్రం మరణించారు.

  • Share this:
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు విసు కన్నుమూసారు. కొన్ని రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధ పడుతున్న ఆయన మార్చ్ 22 సాయంత్రం మరణించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. విసు మృతితో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. అక్కడ ఆయన ఎన్నో సినిమాల్లో నటించడమే కాదు.. దర్శకత్వం కూడా వహించారు. రజినీకాంత్, కమల్ హాసన్ నుంచి నేటి స్టార్స్ వరకు అందరితోనూ నటించిన అనుభవం విసు సొంతం. ముఖ్యంగా అప్పట్లో రజినీకాంత్ హీరోగా వచ్చిన అరుణాచలం సినిమాలో రంగాచారి పాత్రలో నటించాడు విసు.
నటుడు విసు కన్నుమూత (actor visu death)
నటుడు విసు కన్నుమూత (actor visu death)

ఈ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కూడా చాలా డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ సుపరిచితుడు అయ్యాడు విసు. తమిళ సినిమాలకే ఎక్కువగా సేవలు అందించారు ఆయన. ముఖ్యంగా బుల్లితెరపై చాలా సీరియల్స్‌లో కూడా నటించారు విసు. దర్శకుడిగా, రైటర్‌గా, స్క్రీన్ ప్లే రచయితగా ఎన్నో సినిమాలకు పని చేసారు. ఈయన తొలి సినిమా కుటుంబం ఒరు కదంబం. అంటే కుటుంబం ఓ పువ్వు అని అర్థం. దీనికి నటుడిగానే కాకుండా రచయితగా కూడా పనిచేసారు.
నటుడు విసు కన్నుమూత (actor visu death)
నటుడు విసు కన్నుమూత (actor visu death)

తెలుగులో సంచలన విజయం సాధించిన సంసారం ఒక చదరంగం సినిమా ఒరిజినల్ వర్షన్ డైరెక్ట్ చేసింది విసునే. అక్కడ ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. తెలుగులో కూడా ఆడదే ఆధారం సినిమాను ఆయన తెరకెక్కించాడు. దాంతో పాటు ఆయన తెరకెక్కించిన సినిమాలు చాలానే తెలుగులో రీమేక్ అయ్యాయి. ఇక రాజకీయాల్లో కూడా విసు తనదైన ముద్ర వేసారు. తమిళనాడులో బిజేపీ తరఫున ప్రచారం చేసాడు. ఈయన మరణంపై తెలుగు చిత్ర పరిశ్రమ కూడా దిగ్ధ్రాంతిని వ్యక్తం చేస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు