Home /News /movies /

NOTED MALAYALAM TV ACTOR SABARI NATH PASSED AWAY DUE TO CARDIAC ARREST PK

ఇండస్ట్రీలో మరో విషాదం.. బ్యాడ్మింటన్ ఆడుతూ ప్రాణాలు వదిలిన ప్రముఖ నటుడు..

మలయాళ నటుడు శబరి నాథ్ కన్నుమూత (actor sabari nath)

మలయాళ నటుడు శబరి నాథ్ కన్నుమూత (actor sabari nath)

Sabari Nath: ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో అయితే ఈ మధ్య చాలా మంది ప్రముఖులు చనిపోయారు.

ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో అయితే ఈ మధ్య చాలా మంది ప్రముఖులు చనిపోయారు. మొన్నటికి మొన్న ప్రముఖ దర్శకుడు సాచీ మరణం కూడా వాళ్లను తీవ్రంగా కలిచివేసింది. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు కూడా మరణించాడు. మలయాళంలో సీరియల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శబరి నాథ్ గుండెపోటుతో కన్నుమూసాడు. సెప్టెంబర్ 17న ఈయన ఉన్నట్లుండి అర్ధాంతరంగా చనిపోయాడు.
మలయాళ నటుడు శబరి నాథ్ కన్నుమూత (actor sabari nath)
మలయాళ నటుడు శబరి నాథ్ కన్నుమూత (actor sabari nath)

బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయాడు శబరి నాథ్. దాంతో అతడి స్నేహితులు వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. శబరి నాథ్ వయసు కేవలం 43 ఏళ్లు మాత్రమే. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మలయాళంలో శబరి నాథ్‌కు మంచి ఇమేజ్ ఉంది. టీవీ సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తుంటాడు ఈయన. మిన్నికెట్టు, అమల, స్వామి అయ్యప్పన్ లాంటి సీరియల్స్‌తో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శబరి నాథ్.
మలయాళ నటుడు శబరి నాథ్ కన్నుమూత (actor sabari nath)
మలయాళ నటుడు శబరి నాథ్ కన్నుమూత (actor sabari nath)

ఈ మధ్యే మొదలైన పడత పెయిన్‌కిలి అనే సీరియల్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శబరి నాథ్ మరణవార్త విని మలయాళ టీవీ ఇండస్ట్రీ షాక్ అయింది. అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నఫలంగా ఇలా మరణించడం ఏంటి అంటూ బాధ పడుతున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు శబరి నాథ్ ఆత్మకు శాంతి కలగాలంటూ సోషల్ మీడియాలో సంతాపం తెలియచేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Malayala Cinema

తదుపరి వార్తలు