Home /News /movies /

NOTED MALAYALAM ACTOR UNNIKRISHNAN NAMPOOTHIRI PASSES AWAY AT THE AGE OF 98 PK

Unnikrishnan Namboothiri: సీనియర్ నటుడు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..

ఉన్నికృష్ణన్ నంబూతిరి (unnikrishnan namboothiri)

ఉన్నికృష్ణన్ నంబూతిరి (unnikrishnan namboothiri)

Unnikrishnan Namboothiri: కేలండర్ మారినా కూడా సినిమా ఇండస్ట్రీకి కష్టాలు మాత్రం తీరడం లేదు.. రాత మారడం లేదు. కొత్త ఏడాదిలో కూడా వరస విషాదాలు వస్తూనే ఉన్నాయి. మొన్న వెన్నెలకంటి.. నిన్న దొరస్వామి రాజు మరణాలు ఇంకా పచ్చిగా..

కేలండర్ మారినా కూడా సినిమా ఇండస్ట్రీకి కష్టాలు మాత్రం తీరడం లేదు.. రాత మారడం లేదు. కొత్త ఏడాదిలో కూడా వరస విషాదాలు వస్తూనే ఉన్నాయి. మొన్న వెన్నెలకంటి.. నిన్న దొరస్వామి రాజు మరణాలు ఇంకా పచ్చిగా ఉండగానే ఇప్పుడు మరో సీనియర్ నటుడు కన్నుమూసాడు. సీనియర్ మలయాళ, తమిళ నటుడు ఉన్నికృష్ణన్ నంబూతిరి అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వయోభారంతో ఇబ్బంది పడుతున్న ఈయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జయరాజ్ దేశదనం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు ఈయన. ఆ తర్వాత మలయాళంలో వన్ మ్యాన్, కలియట్టం, కైకుదన్న నీలవ్‌లతో సహా 15కి పైగా చిత్రాల్లో నటించారు. మలయాళమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించాడు ఉన్నికృష్ణన్ నంబూతిరి. కండుకొండైన్ కండుకొండైన్, పమల్ కె సమ్మండం, చంద్రముఖి లాంటి సినిమాలలో ఉన్నికృష్ణన్ కనిపించారు. కళ్యాణ రామన్ సినిమా కాకుండా.. దిలీప్ మాయమోహిని, మమ్ముట్టి నటించిన రాప్పకల్, లౌడ్ స్పీకర్, పోక్కిరిరాజా సినిమాల్లో కూడా నటించాడు ఉన్నికృష్ణన్. మోహన్ లాల్ నటించిన ఫోటోగ్రాఫర్, మధురొనంబరకట్టు లాంటి సినిమాలలో కూడా నటించాడు ఈయన. ఉన్నికృష్ణన్ నంబూతిరి కన్నూర్‌లోని పయ్యన్నూర్‌లో జన్మించారు. ఈయన మృతికి మలయాళ, తమిళ సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Malayala Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు