• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NOTED MALAYALAM ACTOR TOVINO THOMAS GETS SERIOUSLY INJURED IN KALA MOVIE SHOOTING PK

Actor Tovino Thomas accident: షూటింగ్‌లో ప్రమాదం.. యువ నటుడి పరిస్థితి విషమం..

మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)

Actor Tovino Thomas accident: అసలే ఇప్పుడు టైమ్ బాగోలేదు.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి..

  • Share this:
అసలే ఇప్పుడు టైమ్ బాగోలేదు.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు అంతా. ఇలాంటి సమయంలో మరో చేదువార్త వచ్చింది. షూటింగ్ చేస్తుండగా ఓ యువ నటుడు గాయపడ్డాడు.. అది కూడా మామూలుగా కాదు.. తీవ్రగాయాల పాలయ్యాడు.. ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ప్రముఖ మలయాళ నటుడు, ఫోరెన్సిక్ ఫేమ్ టోవినో థామస్‌ తీవ్ర గాయాలతో ప్రస్తుతం కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఈయన 'కాలా' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. అందులో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఓ భారీ యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో గాయపడ్డ థామస్‌కు ఇంటర్నల్‌ బ్లీడింగ్ కావటంతో ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)
మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)

ఐసియూలో ఈయనకు చికిత్స అందిస్తున్నారు ఇప్పుడు. కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈయన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. థామస్ కడుపులో బలంగా దెబ్బ తగలటంతో ఇంటర్నల్‌ బ్లీడింగ్ భారీగానే జరిగింది. దాంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. టోవినో థామస్‌కు ప్రమాదం జరిగిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాలయాళ ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది.

మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)
మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)


ఈ విషయం తెలియగానే అభిమానులు సోషల్‌ మీడియాలో ఈయనకు గెట్ వెల్ సూన్ సందేశాలు పంపిస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. టోవినో థామస్‌కు మాలయాళ ఇండస్ట్రీలో హీరోగా, విలన్‌గా మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఈ యువ నటుడు. ప్రస్తుతం ఈయన పరిస్థితి తెలిసి పాపం అంతా ఫీల్ అవుతున్నారు. ఇటీవల థామస్ నటించి 'ఫోరెన్సిక్' సినిమా తెలుగులోనూ 'ఆహా' ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో థామస్ ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: