ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో హఠాన్మరణం..

Chiranjeevi Sarja: కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ హీరో చిరంజీవి సర్జ కన్నుమూసాడు. హార్ట్ ఎటాక్‌తో ఈయన ప్రాణాలు వదిలాడు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన బంధువు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 7, 2020, 5:04 PM IST
ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో హఠాన్మరణం..
చిరంజీవి సర్జ కన్నుమూత (chiranjeevi sarja)
  • Share this:
కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ హీరో చిరంజీవి సర్జ కన్నుమూసాడు. హార్ట్ ఎటాక్‌తో ఈయన ప్రాణాలు వదిలాడు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు. జూన్ 6న ఈక్ష్నకు శ్వాస సమస్య వచ్చింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చిరంజీవి వయసు చాలా తక్కువ కావడంతో ఇది హృదయ సంబంధ వ్యాధి అని కుటుంబం అనుకోలేదు. కానీ ఊపిరి ఆడకుండా ఉండటంతో పాటు తీవ్రమైన ఛాతీ నొప్పి కూడా వచ్చింది. దాంతో అతను ఇప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
చిరంజీవి సర్జ కన్నుమూత (chiranjeevi sarja)
చిరంజీవి సర్జ కన్నుమూత (chiranjeevi sarja)


అతన్ని బతికించడానికి చాలా ప్రయత్నించినా కూడా కుదర్లేదు. 2009లో వాయుపుత్ర సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. తొలి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 25 సినిమాలు చేసాడు చిరంజీవి సర్జ. ఈయన ప్రముఖ కన్నడ హీరోయిన్ మేఘనా రాజ్‌ను 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఈమె తెలుగులో అల్లరి నరేష్‌తో బెండు అప్పారావు సినిమాలో నటించింది.
చిరంజీవి సర్జ కన్నుమూత (chiranjeevi sarja)
చిరంజీవి సర్జ కన్నుమూత (chiranjeevi sarja)

2020లో ఇప్పటికే చిరంజీవి నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. మరో నాలుగు సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మరో అరడజన్ కథలు విన్నాడు ఈ హీరో. స్టార్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో అర్ధాంతరంగా చనిపోవడం అభిమానులతో పాటు కన్నడ ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: June 7, 2020, 4:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading