NOTED DIRECTOR RAJIV MENON MOTHER SINGER KALYANI MENON PASSED AWAY DUE TO HEALTH ISSUES IN CHENNAI PK
Kalyani Menon: దక్షిణాది ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత..
గాయని కళ్యాణి మీనన్ కన్నుమూత (Kalyani Menon dies)
Kalyani Menon: సినిమా ఇండస్ట్రీలో విషాదాలు ఆగడం లేదు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. తాజాగా మరో విషాదం జరిగింది. ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్(Kalyani Menon) కన్నుమూసారు.
సినిమా ఇండస్ట్రీలో విషాదాలు ఆగడం లేదు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. తాజాగా మరో విషాదం జరిగింది. ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ కన్నుమూసారు. ఈమె వయసు 80 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కళ్యాణి.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కళ్యాణి మీనన్ ఎవరో కాదు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ప్రియురాలు పిలిచింది లాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాజీవ్ మీనన్ తల్లి. కేరళ, తమిళనాడులో ఈమె పాటలకు అభిమానులున్నారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఎన్నో పాటలు పాడారు కళ్యాణి. ఈమె లేకుండా తన సినిమా పాటలను పూర్తి చేసేవాడు కాదు రెహమాన్.
ప్రేమికుడు నుంచి మొదలు పెట్టి మొన్న ఏ మాయ చేసావే వరకు కూడా ప్రతీ సినిమాలోనూ పాటలు పాడారు కళ్యాణి మీనన్. అంతెందుకు ఆయన 2000 ఏడాదిలో రూపొందించిన ప్రైవేట్ ఆల్బమ్ వందేమాతరం పాటను కూడా ఆలపించారు కళ్యాణి మీనన్. సినిమాల కంటే కూడా శాస్త్రీయ సంగీతంలో ఈమెకు ఎక్కువగా ప్రవేశం ఉంది. అక్కడే ఆమె శిక్షణ కూడా తీసుకున్నారు.
తెలుగు, తమిళం, మలయాలం భాషలలో 100కి పైగా పాటలు పాడారు ఈమె. 1979లో ఇళయరాజా సంగీతం అందించిన నల్లతోరు కుటుంబం సినిమాతో గాయనిగా పరిచయం అయ్యారు. అక్కడ్నుంచి చాలా సినిమాలకు పాడారు కళ్యాణి. తమిళంలో కాధలన్, ముత్తు, అలైపాయుథే, విన్నైతంది వరువాయ, లాంటి సినిమాల్లో ఈమె పాడారు. కేరళలోని ఎర్నాకుళంలో జన్మించిన కళ్యాణి.. పదేళ్ల వయసులోనే పాటలు పాడటం ప్రారంభించారు.
తన కుమారుడు రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన కందుకొండెయిన్ కందుకొండేన్ చిత్రంలో అతిధి పాత్రలోనూ నటించారు కళ్యాణి. కొన్ని రోజులుగా అనారోగ్య సమ్యలతో బాధపడుతున్న కళ్యాణి.. పరిస్థితి చేదాటడంతో కన్నుమూసారు. ఈమె మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేసారు. కళ్యాణి మృతిపై ఏఆర్ రెహమాన్, చిత్ర లాంటి వాళ్లు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేసారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.