షాకింగ్.. ఆ టాలీవుడ్ కమెడియన్‌కు కన్ను కనిపించదంట..

తెలుగులో వెంకీ, రెడీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ సహా దాదాపు 30 సినిమాలకు పైగానే నటించిన మాస్టర్ భరత్ గుర్తున్నాడు కదా. పైకి చూడ్డానికి చాలా ఆరోగ్యంగా కనిపించే ఈ కుర్రాడికి ఓ కన్ను కనిపించదు అంటూ నమ్మడం సాధ్యమేనా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 28, 2020, 8:12 PM IST
షాకింగ్.. ఆ టాలీవుడ్ కమెడియన్‌కు కన్ను కనిపించదంట..
మాస్టర్ భరత్ ఫైల్ ఫోటో (Child artist Bharath)
  • Share this:
వెండితెరపై కనిపించే వాళ్ల జీవితాలన్నీ ఆనందంగా ఉంటాయనుకోవడం తప్పే. ఎందుకంటే వాళ్లకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది.. అందులో కూడా బాధలు, కన్నీరు ఉంటాయి. ఇప్పుడు ఓ కమెడియన్ జీవితంలో కూడా ఇలాంటి చేదు సంఘటనే ఉంది. చిన్నప్పట్నుంచే నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మాస్టర్ భరత్. మిల్లీమీటర్ సెంటీమీటర్ అయినట్లు ఇప్పుడు ఈయన కూడా సీనియర్ అయిపోయాడు. తెలుగులో వెంకీ, రెడీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ సహా దాదాపు 30 సినిమాలకు పైగానే నటించాడు భరత్. తమిళనాట కూడా ఈయనకు మంచి ఇమేజ్ ఉంది. ఊహ తెలిసినప్పటి నుంచే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు భరత్.

మాస్టర్ భరత్ ఫైల్ ఫోటో (Child artist Bharath)
మాస్టర్ భరత్ ఫైల్ ఫోటో (Child artist Bharath)


ఓ వైపు నటిస్తూనే మరోవైపు చదువుల్లో కూడా మనోడు ఫాస్టే. ఇప్పుడు ఈయన డాక్టర్ కూడా. మెడిసిన్ పూర్తి చేసి డాక్టరేట్ చేస్తున్నాడు భరత్. మొన్నామధ్య అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ABCD సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు భరత్. ప్రస్తుతం సాగర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఈ కుర్ర నటుడు తన జీవితంలోని షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. ముఖ్యంగా తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. తనకు ఊహ తెలిసినప్పుటి నుంచి సినిమాల్లోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు భరత్. అలాగే మెడిసిన్ పూర్తి చేసానని.. ప్రస్తుతం మెడిసిన్‌లోనే డాక్టరేట్ చేస్తున్నాని తెలిపాడు భరత్.

మాస్టర్ భరత్ ఫైల్ ఫోటో (Child artist Bharath)
మాస్టర్ భరత్ ఫైల్ ఫోటో (Child artist Bharath)
చెన్నైలో కాలేజ్ జాయిన్ అయిన కొత్తలోనే పెద్ద యాక్సిడెంట్ అయిందని.. అప్పుడే బోండాంలా ఉన్న తాను చాలా సన్నబడ్డానని చెప్పుకొచ్చాడు భరత్. ఆ ప్రమాదంలోనే తన కుడి కన్నుకు పెద్ద దెబ్బ తగిలిందని.. ప్రస్తుతం తనకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్పాడు. చాలా రోజుల పాటు కళ్ల జోడుతోనే తిరిగేవాడినని తెలిపాడు భరత్. జిమ్ వర్కవుట్ చేస్తున్నపుడు రాడ్‌లో ఉండే స్ప్రింగ్ వచ్చి తన కన్నుకి గట్టిగా తగిలేసిందని చెప్పాడు ఈయన. డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఆయన చెక్ చేసాడని.. అప్పటికే నా కుడి కన్ను కనిపించడం మానేసిందని షాకింగ్ విషయం చెప్పాడు. కంట్లో బ్లాక్ ఉంటుందని.. మందులతో తగ్గిపోతుంది కానీ ఇప్పటికీ తనకు అది తగ్గలేదని చెప్పుకొచ్చాడు ఈయన.
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు