Jabardasth Comedy Show : బుల్లితెర ప్రేమ జంట.. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్. వీరిద్దరు కలిసి రొమాన్స్ పండించారంటే గులాబ్ జామ్ తిన్నంత తియ్యగా ఉంటుంది. అందుకే ఈ జంటకు స్క్రీన్‌పై వందకు వంద శాతం మార్కులు పడతాయి. నిజ జీవితంలోనూ రష్మీ, సుధీర్ లవర్స్‌యేనా అన్నంతలా వీళ్లు ప్రేమ రసాన్ని అభిమానులకు పంచుతారు. అందుకే వీళ్ల జంటపై స్కిట్లు చేసినా, కామెడీ చేసినా అది హిట్ అవుతుంది. జబర్దస్త్ నిర్వాహకులు కూడా వీరి రొమాన్స్‌ను బాగానే వాడేసుకుంటారు. ఢీ ఛాంపియన్స్‌లోనూ రష్మీ, సుధీర్ జంట హల్‌చల్ చేస్తూ రేటింగ్స్ పెరగడంలో ఉపయోగపడుతుంటారు.
అయితే, ఈ మధ్య వీళ్లిద్దరి రొమాన్స్ అభిమానులకు బోర్ కొడుతుందని అనుకున్నారో ఏమో గానీ.. సుధీర్ కోసం మరో యువతిని రంగంలోకి దించారు జబర్దస్త్ నిర్వాహకులు. రష్మీని చూపిస్తూనే, మరో యువతి కోసం సుధీర్ తాపత్రయపడుతున్నాడన్నట్లు చూపించే సన్నివేశాలు బాగా రక్తి కట్టిస్తున్నాయి. తాజాగా, శుక్రవారం ప్రసారమైన షోలోనూ ఓ యువతి తెల్లని చీరలో కనిపించగా, ఆమె కోసం సుధీర్ వెంటపడే సన్నివేశం బాగా ఆకట్టుకుంది.
ఆకాశ వీధుల్లోంచి భువికి దిగివచ్చిందా అన్నట్లు ఆమె కూడా చాలా క్యూట్‌గా కనిపించింది. సుధీర్‌తో పాటు ఆమె స్క్రీన్‌పై మెరిసింది. ఆమె రాగానే.. సౌందర్య లహరి.. స్వప్న సుందరి అన్న సాంగ్ వేశారు. అది సన్నివేశానికి సరిగ్గా సరిపోయింది. ఆమె అందం సుధీర్ స్కిట్‌కు బాగా కలిసివచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Rashmi Gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood