Sri Krishna: టాలీవుడ్ వెండితెర శ్రీకృష్ణులు..

Sri Krishna | శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో  శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడి జన్మష్టమి సందర్భంగా తెలుగు తెరపై శ్రీకృష్ణ పాత్రధారిలో అలరించిన హీరోలపై న్యూస్ 18 స్పెషల్..

news18-telugu
Updated: August 23, 2019, 3:58 PM IST
Sri Krishna: టాలీవుడ్ వెండితెర శ్రీకృష్ణులు..
వెండితెర శ్రీకృష్ణులు (ఫేస్‌బుక్ ఫోటోలు)
news18-telugu
Updated: August 23, 2019, 3:58 PM IST
శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో  శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. త్రేతా యుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో మహావిష్ణువు ఎత్తిన పరిపూర్ణావతారం శ్రీకృష్ణుడిదే. అటువంటి భగవంతుడు చిన్ని కృష్ణయ్యగా గోపికలందరి ఆటపట్టించాడు. వెన్నదొంగగా పేరు తెచ్చుకున్నాడు. అటు ధర్మబద్ద జీవిత గమనానికి మానవాళి అందరికీ భగవద్గీతను అందించిన పురుషోత్తముడుగా నిలిచాడు శ్రీకృష్ణుడు. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడి జన్మష్టమి సందర్భంగా తెలుగు తెరపై శ్రీకృష్ణ పాత్రధారిలో అలరించిన హీరోలపై న్యూస్ 18 స్పెషల్.. తెలుగు సినిమాల్లో కృష్ణుడి వేషాలు వేసిన వారిలో మొదట చెప్పుకోవాల్సింది మహానటుడు ఎన్టీఆర్ గురించే. శ్రీకృష్ణుడు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చే రూపం రామారావుదే. ఆ తరువాత ఎంతో మంది ఆ పాత్రను పోషించిన ఇప్పటికీ శ్రీకృష్ణుడంటే తెలుగు ప్రజలకు ఆ తారకరాముడే గుర్తుకువస్తాడు.

కృష్ణుడిగా రామారావు (ఎన్టీఆర్)


ఎన్టీఆర్‌తో పాటు కాంతారావు,ఏఎన్నాఆర్, శోభన్ బాబు, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ, నాగార్జున,పవన్ కళ్యాణ్ వంటి హీరోలందరు కృష్ణుడి అవతారంలో కనిపించి మెప్పించారు.మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఎలాగో...భగద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఎలా వున్నాయో...ఎన్టీఆర్ కూడా ఆయన సినీ ప్రస్థానంలో పద్దెనిమిది సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించడం యాదృచ్చికమే అని చెప్పాలి. ఎన్టీఆర్ మొట్ట మొదటగా శ్రీకృష్ణుడిగా వేషం కట్టిన సినిమా ‘మాయా బజార్’. ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా తన నటనతో మాయనే చేశాడు. కానీ 1953లో విడుదలైన ‘ఇద్దరు పెళ్ళాలు’ సినిమాలో రామారావు మూడు పదుల వయసులో ఓ స్వప్న గీతంలో తెలుగుతెరపై కృష్ణుడిగా తొలిసారి కనువిందు చేశారు.

శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్(ఫేస్‌బుక్ ఫోటో)




ఆ తర్వాత ‘దీపావళి’, ‘భక్త రఘునాథ్’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’,‘కర్ణ (తమిళ్ డబ్బింగ్), ‘వీరాభిమన్యు’, ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘శ్రీకృష్ణతులాభారం’, ‘శ్రీకృష్ణావతారం’,‘శ్రీకృష్ణవిజయం’, ‘శ్రీకృష్ణసత్య’,‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘దాన వీర శూర కర్ణ’, శ్రీ మద్విరాట పర్వం’ వంటి పౌరాణిక సినిమాల్లో శ్రీకృష్ణుడిగా మెప్పించాడు.ఆయా సినిమాల్లో ఎన్టీఆర్..ఒకే ఆహార్యం..ఒకే వయసును ప్రతిబింబిస్తూ నటించడం రామారావుకు మాత్రమే సాధ్యమైంది. ఈ రకంగా ఒకే పాత్రను ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోగా ఎన్టీఆర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అలాగే సినిమాల్లోని అంతర్నాటకాలతో కలిపి మొత్తం 33సార్లు కృష్ణునిగా నటించారు ఎన్టీఆర్. అన్నిసార్లు ఆ పాత్రను పోషించడం ప్రతిసారీ ప్రేక్షకుల్ని మెప్పించడం అన్నది అందరికీ సాధ్యమయ్యే పనికాదు.

శ్రీకృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ (Youtube/Photo)


శ్రీ కృష్ణుడిగా అనేక సినిమాల్లో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ ‘పాండురంగ మహత్యం’ సినిమాలో భక్తుడిగా నటించాడు. ఈ సినిమాలో విజయ నిర్మల చిన్ని కృష్ణుడి పాత్రలో నటించడం విశేషం.
Loading...
‘పాండురంగ మహాత్యం’లో శ్రీకృష్ణ పాత్రలో విజయ నిర్మల (Youtube/Photo)


ఎన్టీఆర్ తర్వాత శ్రీకృష్ణుడిగా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిన ఘనత కాంతారావుకు దక్కుతుంది. అంతేకాదు తనదైన శైలిలో ఆ పాత్రకే వన్నెతీసుకొచ్చారు.కాంతారావు మొదటిసారి శ్రీకృష్ణుడి వేషం వేసింది మాత్రం మలయాళంలో తెరకెక్కిన ‘భక్త కుచేల’. ఆ తర్వాత ‘నర్తనశాల’, ‘బభ్రువాహన’, ‘పాండవ వనవాసం’,‘ప్రమీలార్జునీయం’, వంటి సినిమాల్లో కాంతారావు శ్రీకృష్ణుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించారు.

శ్రీకృష్ణుడిగా కాంతారావు (యూట్యూబ్)


ఎన్టీఆర్, కాంతారావుల సమకాలీకుడైన ఏఎన్నాఆర్ ..మాత్రం తన సినీ జీవితంలో ఏ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర వేయలేదు. కానీ ‘గోవుల గోపన్న’ చిత్రంలో మాత్రం ఒక పాటలో మాత్రం శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను కనువిందు చేసారు.

‘గోవుల గోపన్న’లో కాసేపు శ్రీకృష్ణ వేషధారిగా అక్కినేని నాగేశ్వరరావు (Youtube/Photo)


ఎన్టీఆర్, కాంతారావుల తర్వాత తెలుగుతెరపై శ్రీకృష్ణుడిగా మెప్పించిన హీరోల్లో శోభన్ బాబు ఒకరు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బుద్దిమంతుడు’ సినిమాలో మొదటి సారి శ్రీకృష్ణుడి వేషంలో దర్శనమిచ్చాడు శోభన్. ఆ తర్వాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరెక్కిన ‘కురుక్షేత్రం’ మూవీలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఆడియన్స్‌కు దర్శనమిచ్చాడు.

శ్రీకృష్ణుడిగా శోెభన్ బాబు (క్రెడిట్ యూట్యూబ్)


మరోవైపు ఎన్టీఆర్ పౌరాణిక వారసత్వాన్ని ఆయన తనయుడు బాలకృష్ణ కూడా కంటిన్యూ చేశాడు. బాలకృష్ణ కూడా ‘శ్రీకృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ సినిమాల్లో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించి కనువిందు చేసాడు.  అంతేకాదు ‘మంగమ్మ గారి మనవడు’, ‘పట్టాభిషేకం’ వంటి సాంఘిక చిత్రాల్లో వచ్చిన పాటల్లో వేణుగాన లోలుడిగా గెస్ట్ అప్పీరియన్స్‌ ఇవ్వడం విశేషం.

శ్రీకృష్ణుడిగా బాలకృష్ణ (ఫేస్‌బుక్ ఫోటో)


గతేడాది రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణ కూడా.‘శ్రీకృష్ణావతారం’ మూవీలో బాలకృష్ణుడిగా వెండితెరకు పరిచయం అవ్వడం విశేషం.

‘శ్రీకృష్ణావతారం’లో బాలకృష్ణుడి పాత్రలో నటించిన హరికృష్ణ (Youtube/Photo)


అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి ...‘యశోదకృష్ణ’ సినిమాలో బాలకృష్ణుడిగా నటించింది. ఇదే సినిమాలో సీనియర్ హీరో రామకృష్ణ శ్రీకృష్ణుడిగా మెప్పించాడు.

యశోద కృష్ణలో శ్రీదేవి (ఫేష్‌బుక్ ఫోటో)


రేలంగి నరసింహారావు డైరెక్షన్ల వచ్చిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... రాజేంద్రప్రసాద్ శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ నటకరిటీకి నటుడిగా మంచి గుర్తింపే తీసుకొచ్చింది.

శ్రీకృష్ణుడిగా రాజేంద్ర ప్రసాద్ (యూట్యూబ్ క్రెడిట్)


అటు నాగార్జున కూడా విష్ణు హీరోగా వచ్చిన ‘కృష్ణార్జున’లో శ్రీకృష్ణుడి పాత్రను తనదైన శైలిలో మెప్పించాడు. అది కూడా నెమలి పించం, కిరీటాలు లేకుండా సామాన్యుడిలా ఈ సినిమాలో కనిపించడం విశేషం.

‘కృష్ణార్జున’లో శ్రీకృష్ణ పాత్రలో మెప్పించిన అక్కినేని నాగార్జున (Youtube/Photo)


ఇప్పటి తరం హీరోల్లో ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించి ప్రేక్షకులతో కేక పుట్టించాడు. ఈ ఇద్దరు హీరోలు నెమలి పించం ఉన్న నీలమేఘశ్యాముడిగా నటించలేకపోయారు.

గోపాల గోపాల (ఫేస్‌బుక్ ఫోటో)


మరోవైపు కొంతమంది హీరోలు సాంఘిక చిత్రాల్లో శ్రీకృష్ణుని పాత్రలను సందర్భోచితంగా వేసి మెప్పించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కాసేపు శ్రీకృష్ణుడిగా కనిపించాడు.

‘సాక్షి’ సినిమాలో ఒక పాటలో కాసేపు శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించిన కృష్ణ (Youtube/Photo)


తండ్రిబాటలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘యువరాజు’ సినిమాలో ఒక పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. మరోవైపు సునీల్ ‘అందాలరాముడు’లో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనిపించడం విశేషం.

శ్రీకృష్ణుడిగా మహేశ్ (క్రెడిట్ యూట్యూబ్)


అంతేకాకుండా మన దర్శక నిర్మాతలు ఎంతో మంది సందర్భానుసారంగా శ్రీకృష్ణజన్మాష్టమిని సినిమాల్లో చూపిస్తూనే వున్నారు. వీటితో పాటుగా శ్రీకృష్ణుడిపై అనేక త్రీడి యానిమేటెడ్ సినిమాలు వచ్చాయి. ఇక అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో నటించడం విశేషం.

చిన్న పిల్లలతో తెరకెక్కించిన ‘దాన వీర శూర కర్ణ’లో శ్రీకృష్ణుడి పాత్రలో మాస్టర్ ఎన్టీఆర్ (Youtube/Photo)


తాజాగా కన్నడలో తెరకెక్కిన ‘కురుక్షేత్ర’ సినిమాలో కన్నడ నటుడు రవిచంద్రన్..శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు. ీ సినిమాను తెలుగులో ‘కురుక్షేత్రం’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు.

కన్నడ డబ్బింగ్ మూవీ ‘కురుక్షేత్రం’లో శ్రీకృష్ణుడి పాత్రలో రవిచంద్రన్ (Twitter/Photo)


శ్రీకృష్ణుడి చేసిన పనుల గురించి, ఆయన చేసిన గీతోపదేశం చిన్నారులకు కూడా అర్ధం మయ్యే రీతిలో ఇవి అలరిస్తూనే వున్నాయి.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...