మహేష్‌ బాబును టార్గెట్ చేస్తోన్న బాలకృష్ణ, నాగార్జున..

సూపర్ స్టార్ మహేష్ బాబును టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ,నాగార్జునలు టార్గెట్ చేసారు. ఇంతకీ వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 7, 2019, 7:14 PM IST
మహేష్‌ బాబును టార్గెట్ చేస్తోన్న బాలకృష్ణ, నాగార్జున..
2020 సంక్రాంతి రేసులో బాలయ్య,నాగ్,మహేష్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 7, 2019, 7:14 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబును టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ,నాగార్జునలు టార్గెట్ చేసారు. ఇంతకీ వివరాల్లోకి వెళితే.. ఈ ఇయర్ మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘మహర్షి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను స్టార్ట్ చేసాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు..ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను చూసి చెప్పొచ్చు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి మహేష్ బాబుతో పాటు నందమూరి బాలకృష్ణ కూడా కే.యస్.రవికుమార్ సినిమాతో రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.  ఈ సినిమాను ఈ నెల 12న లాంఛంగా ప్రారంభించి వచ్చే పొంగల్‌కు రెడీ  చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బాలయ్య కూడా ఒక్కసారి కమిటైతే సినిమా షూటింగ్ పూర్తి  కావాల్సిందే.

Not Only Mahesh babu Sarileru neekevvaru Even Balakrishna, Nagarjuna Movies also in 2020 Sankranti race,Mahesh babu sankranti race,balakrishna nagarjuna also 2020 sankranti race,mahes babu nagarjuna balakrishna in 2020 pongal race,balakrishna facebook,balakrishna twitter,mahesh babu twitter,mahesh babu instagram,nagarjuna instagram,nagarjuna twitter,mahesh babu sarileru neekevvaru sankranti race,balakrishna ks ravi kumar movie in sankranti race,nagarjuna kalyan krishna kurasala bangarraju sequel in sankranti race,sai dharam tej maruthi bhogi movie,tollywood,telugu cinema,మహేష్ బాబు,మహేశ్ బాబు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి రేస్,బాలకృష్ణ నాగార్జున సంక్రాంతి రేసు,సంక్రాంతి రేసులో మహేష్ బాబు నాగార్జున బాలకృష్ణ,బాలయ్య,ఎన్బీకే,సాయి ధరమ్ తేజ్,మారుతి,మారుతి సాయి ధరమ్ తేజ్ భోగి,2020 సంక్రాంతి సినిమాలు,
సంక్రాంతి రేసులో బాలకృష్ణ,మహేష్ బాబు,నాాగార్జున


మరోవైపు  నాగార్జున కూడా ‘మన్మథుడు 2’ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగర్రాజు’ సినిమాను వచ్చే నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. గతంలో నాగ్ నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంక్రాంతి రేసులో లేటుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్టైయిన సంగతి తెలిసిందే కదా. అందుకే ఇపుడు అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడు. ఇంకోవైపు సాయి ధరమ్ తేజ్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాను కూడా  సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ సంక్రాంతికి ఈ సినిమా వస్తే..‘భోగి’ టైటిల్‌తో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఒకవేళ వీలుకాకపోతే.. ‘ప్రతిరోజు పండగే’ అనే టైటిల్‌తో విడుదల చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. మొత్తానికి సంక్రాంతి రేసులో మొదటగా అడుగుపెట్టిన మహేష్ బాబుకు పోటీగా సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలతో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా రేసులో ఉన్నారు. మొత్తానికి 2020 సంక్రాంతి పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారన్నది చూడాలి.

First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...