కాజల్,రకుల్ ప్రీత్,శ్రీదేవిలే కాదు.. తండ్రి కొడుకుల సరసన యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇంకెవరెన్నారో తెలుసా..
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్... తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు.
Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: April 21, 2019, 8:40 PM IST
కాజల్,శ్రీదేవి,రకుల్ ప్రీత్ సింగ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్... తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ..కొడకు నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నటించింది. ఇపుడు నాగ చైతన్య తండ్రి నాగార్జున సరసన ‘మన్మథుడు 2’లో కథానాయికగా యాక్ట్ చేస్తోంది. అంతకు ముందు లావణ్య త్రిపాఠి కూడా నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయనా’లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన ‘యుద్ధం శరణం’లో హీరోయిన్గా నటించింది.

నాగ చైతన్య,నాగార్జున,రకుల్
అటు టాలీవుడ్ చందమామ కాజల్ కూడా కొడుకు రామ్ చరణ్‌తో ‘మగధీర’ ‘నాయక్’,‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలు చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఖైదీ నెంబర్150’లో మెగాస్టార్ సరసన నటించడం విశేషం. అలా తండ్రి కొడుకుల సరసన యాక్ట్ చేసిన హీరోయిన్స్ లిస్టులో కాజల్,రకుల్ ప్రీత్, లావణ్య త్రిపాఠిలే కాదు..ఇంకా ఎవరెవరున్నారో వివరాల్లోకి వెళితే..ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ వున్న తండ్రీ కొడుకుల పక్కన హీరోయిన్గా నటించిన వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు.

చిరంజీవి,రామ్ చరణ్,కాజల్
ముందుగా ఎన్టీఆర్, బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్స్ విషయానికొస్తే..ముందుగా ఆ లిస్టులో బాలీవుడ్ హీరోయిన్ రతి అగ్నిహోత్రి ఉంటుంది. ఈ భామ...ఎన్టీఆర్‌తో నాలుగైదు సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత ఈ భామ బాలకృష్ణ సరసన ‘శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో నటించింది. ఇక రామారావు, బాలయ్యలతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ లిస్టులో జయసుధ కూడా వుంది. తారకరాముడితో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సహజనటి..చాలాయేళ్ల తర్వాత ‘అధినాయకుడు’ సినిమాలో బాలయ్య సరసన నటించడం విశేషం. ఇక రామారావు, బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్స్ లిస్టులో అందాల తార రాధ కూడా వుంది. ఈ భామ ఎన్టీఆర్‌తో ‘చండశాసనుడు’ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక బాలకృష్ణ సరసన రాధ ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.

ఎన్టీఆర్,బాలకృష్ణ,రాధ
ఎన్టీఆర్,బాలకృష్ణ సరసనే కాదు...ఏఎన్నార్,నాగార్జున సరసన నటించిన హీరోయిన్గా రాధా రికార్డులకు ఎక్కింది. రాధా అక్కినేని నాగేశ్వరరావు సరసన ‘ఆదర్శవంతుడు’, ‘వసంత గీతం’ ‘గోపాల కృష్ణుడు’ సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత రాధ కొడుకైన నాగార్జునతో ‘విక్కీదాదా’ సినిమాలో నటించి మెప్పించడం విశేషం.

ఏఎన్నార్,నాగార్జున,రాధ
రాధ అటు తెలుగులోనే కాదు తమిళ్లో కూడా హీరోలైన తండ్రి కొడుకుల సరసన యాక్ట్ చేసింది. అలా తమిళంలో శివాజీ గణేషన్, ప్రభుల సరసన యాక్ట్ చేసిన ట్రాక్ రికార్డు రాధ సొంతం. ఆమె శివాజీ గణేషన్‌తో ‘ఆత్మ బంధువు’ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఈ నడిగర్ తిలకం కొడుకైన ప్రభుతో కూడా రాధ హీరోయిన్గా నటించి మెప్పించింది.అక్కినేని హీరోలైన తండ్రీ కొడుకుల సరసన నటించిన హీరోయిన్స్ లిస్టుల అతిలోకసుందరి శ్రీదేవి కూడా వుంది. ఈ భామ ఏఎన్నార్ సరసన ‘ప్రేమాభిషేకం’, ‘శ్రీరంగనీతులు’, ‘ముద్దుల కొడుకు’ వంటి చాలా సినిమాల్లో హీరోయిన్ నటించి మెప్పించింది.

ఏఎన్నాఆర్,నాగార్జున సరసన నటించిన శ్రీదేవి
ఆ తర్వాత...ఆయన కొడుకు నాగార్జునతోను హీరోయిన్గా నాలుగు సినిమాల్లో నటించింది. ‘ఆఖరి పోరాటం’, ‘గోవిందా గోవిందా’, ‘ఖుదాగవా’, ‘మిస్టర్ బేచారా’ వంటి సినిమాల్లో నటించి అక్కినేని హీరోస్‌కు సూపర్ జోడి అనిపించుకుంది.అటు శ్రీదేవి టాలీవుడ్ కి చెందిన అక్కినేని హీరోల సరసనే కాదు...బాలీవుడ్ ల తండ్రీ కొడుకైలైన ధర్మేంద్ర, సన్నిడియోల్ సరసన కూడా ఈ అతిలోకసుందరి మెరిసింది.

ధర్మేంద్ర,సన్నిడియోల్,శ్రీదేవి
జయప్రద కూడా తండ్రీ కొడుకులైన ధర్మేంద్ర, సన్నిడియోల్ సరసన నటించిన కథానాయికగా రికార్డుల కెక్కింది. అటు అమితాబ్ బచ్చన్‌తో ‘లాల్ బాద్షా’లో హీరోయిన్గా నటించిన శిల్పాశెట్టి.. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ సరసన ‘ఫిర్ మిలేంగే’ సినిమాలో కథానాయికగా నటించింది.

అమితాబ్,అభిషేక్ ల సరసన నటించిన శిల్పాశెట్టి
హీరోలైన తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేసిన హీరోయిన్స్ లిస్టులో రాధిక కూడా ఉంది. ఈ బ్యూటీ కూడా తండ్రైన శివాజీ గణేషన్.. కొడుకైన ప్రభుల సరసన నటించి మెప్పించింది.తండ్రీ కొడుకలైన కృష్ణ, రమేష్ బాబుల సరసన నటించిన హీరోయిన్స్ కూడా చాలా మందే ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణతో ‘గూడచారి 117’ వంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించిన భానుప్రియ... ఆయన కొడుకైన రమేశ్ బాబు హీరోగా నటించిన ‘బ్లాక్ టైగర్’ సినిమాలో కథానాయికగా నటించింది.

కృష్ణ,రమేష్ బాబులతో నటించిన గౌతమి
గౌతమి కూడా కృష్ణ సరసన ‘డియర్ బ్రదర్’ లాంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసి... రమేశ్ బాబు సరసన ‘కృష్ణగారబ్బాయి’, ‘బజారు రౌడీ’ సినిమాల్లో కథానాయికగా నటించింది. ఈ ఘట్టమనేని తండ్రీ కొడుకుల సరసన నటించిన హీరోయిన్ల లిస్టులో రంభ కూడా వుంది. ఈమె సూపర్ స్టార్‌తో ‘రౌడీ అన్నయ్య’ సినిమాలో హీరోయిన్గా నటించి, ఆ తర్వాత రమేశ్ బాబు హీరోగా నటించిన ‘పచ్చతోరణం’లో కథానాయికగా యాక్ట్ చేసింది.కృష్ణ, రమేశ్ బాబుల సరసన నటించిన హీరోయిన్ల లిస్టులో ఆమని కూడా వుంది. ఈ భామా నటశేఖరుడి సరసన ‘పచ్చని సంసారం’లో కథానాయికగా మెప్పించింది. ఆ తర్వాత రమేశ్ బాబు హీరోగా నటించిన ‘అన్నాచెల్లెలు’ సినిమాలో హీరోయిన్గా నటించింది.

మన్మథుడు 2
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్..నాగ చైతన్యతో నటించిన తర్వాత ఇపుడు ‘మన్మథుడు 2’లో నాగార్జున సరసన యాక్ట్ చేస్తోంది. ఏమైనా హీరోయిన్గా హీరోలైన తండ్రీ కొడుకుల సరసన నటించడం అంత ఈజీ కాదనే చెప్పాలి.