NOT ONLY HYPER AADI THESE JABARDASTH COMEDIANS REMUNERATION IS VERY HIGH HERE ARE THE DETAILS TA
హైపర్ ఆది సహా జబర్ధస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా..
హైపర్ ఆది ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)
ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. తాజాగా ఈ షో కోసం ఎవరెవరు ఎంత తీసుకుంటారంటే..
ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం జబర్థస్త్, ఎక్స్ట్రా జబర్థస్త్ ప్రోగ్రాం గురించి ఎదురు చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ షోలను టీవీలో కంటే యూట్యూబ్‌లోనే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఐతే ఈ షోలో ఎక్కువగా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రోగ్రాంను ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండటం లేదని కామన్ ఆడియన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా జబర్థస్త్ ప్రోగ్రాంపై ఓ రేంజ్లో ఫైర్ అయిన సందర్భాలున్నాయి. వివాదాల సంగతి పక్కనపెడితే.. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షోలో ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారనే విషయం ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక జబర్ధస్త్ జడ్జ్‌గా రోజాకు నెలకు రూ. 20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పారితోషం తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు జబర్థస్త్ జడ్జ్ మెగా బ్రదర్ నాగబాబకు రూ. 16 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు అందుకుంటున్నాడట. జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ యాంకర్స్ అనసూయ రష్మిలకు నెలకు రూ. 4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం.
జబర్దస్త్ కామెడీ షో
ఇక టీమ్ లీడర్స్ విషయంలో చమ్మక చంద్ర హైపర్ ఆది కంటే ఎక్కవగా నెలకు రూ. 4లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నాడని చెబుతున్నారు. సుడిగాలి సుధీర్ 3.5 లక్షలు, హైపర్ ఆదికి రూ.3 లక్షలు అందుకుంటున్నాడు. మరోవైపు గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు రూ.2.5 లక్షలు అందుకున్నట్టు సమాచారం. బుల్లెట్ భాస్కర్ కు రూ.2లక్షలు, ఇతర కమెడియన్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఇంటర్నల్ టాక్.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.