హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ సహా జబర్ధస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా..

ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌లో ఎవరెంత తీసుకుంటున్నారంటే..

news18-telugu
Updated: August 5, 2020, 9:03 PM IST
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ సహా జబర్ధస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా..
జబర్దస్త్ కమెడియన్స్ (Jabardasth Comedy Show)
  • Share this:
ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం జబర్థస్త్, ఎక్స్‌ట్రా జబర్థస్త్ ప్రోగ్రాం గురించి ఎదురు చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ షోలను టీవీలో కంటే యూట్యూబ్‌లోనే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. గత కొన్ని రోజులుగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్‌కు అంతగా రేటింగ్స్ రాలేదు. కానీ తాజాగా ప్రసారమవుతున్న షోలతో మళ్లీ పుంజుకుంది.  ఐతే ఈ షోలో ఎక్కువగా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రోగ్రాంను ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండటం లేదని కామన్  ఆడియన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా జబర్థస్త్ ప్రోగ్రాంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సందర్భాలున్నాయి. వివాదాల సంగతి పక్కనపెడితే.. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.

not only hyper aadi sudigali sudheer these jabardasth comedians remunarations is very high here are the details,Jabardasth comedy show,hyper aadi,sudigali sudheer,nagababu,roja instagram,roja twitter,roja,jabardasth sudigali sudheer,telugu anchors remuneration,jabardasth remuneration,jabardasth anchors remuneration,telugu anchor remunaration,telugu anchor suma kanakala remuneration,jabardasth anchor anasuya remuneration,telugu jabardasth anchor rashmi gautam remuneration,telugu cinema,తెలుగు యాంకర్లు,జబర్దస్త్ యాంకర్ అనసూయ,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్స్ రెమ్యునరేషన్స్,తెలుగు యాంకర్ల రెమ్యునరేషన్,తెలుగు యాంకర్ సుమ రెమ్యునరేషన్,తెలుగు సినిమా,హైపర్ ఆది,సుడిగాలి సుధీర్,
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)


ఈ షోలో  ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారనే విషయం ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక జబర్ధస్త్ జడ్జ్‌గా రోజాకు నెలకు రూ. 20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పారితోషం తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు జబర్థస్త్ జడ్జ్ నాగబాబు ప్లేస్‌లో వచ్చిన మనోకు ఇపుడు రూ. 10 లక్షల వరకు పారితోషకం ఇస్తున్నారట. బర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ యాంకర్స్ అనసూయ రష్మిలకు నెలకు రూ. 4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం.

సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)
సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)


ఇక టీమ్ లీడర్స్ విషయంలో చమ్మక చంద్ర హైపర్ ఆది కంటే ఎక్కవగా నెలకు రూ. 4లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నాడని చెబుతున్నారు. సుడిగాలి సుధీర్ 3.5 లక్షలు, హైపర్ ఆదికి రూ.3 లక్షలు అందుకుంటున్నాడు. మరోవైపు గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు రూ.2.5 లక్షలు అందుకున్నట్టు సమాచారం. బుల్లెట్ భాస్కర్ కు రూ.2లక్షలు, ఇతర కమెడియన్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఇంటర్నల్ టాక్.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 5, 2020, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading