Video : వావ్... స్ట్రీట్ డాన్స్ ఇరగదీసిన నోరా ఫతేహి

Nora Fatehi : బాలీవుడ్ సొగసరి నోరా ఫతేహీ... జోరుకు బ్రేకుల్లేకుండా పోతున్నాయి. ఇప్పటికే హాట్ అందాలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ... అప్పుడప్పుడూ డాన్స్ వీడియోలతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

news18-telugu
Updated: November 16, 2019, 8:37 AM IST
Video : వావ్... స్ట్రీట్ డాన్స్ ఇరగదీసిన నోరా ఫతేహి
నోరా ఫతేహి (credit - insta - norafatehi)
  • Share this:
Nora Fatehi : కెనడా బ్యూటీ నోరా ఫతేహీ బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. డాన్సర్, మోడల్, నటి, ప్రొడ్యూసర్, సింగర్... ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ... అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది ఈ భామ. బాలీవుడ్డే కాదు... టాలీవుడ్‌లోనూ నోరాకు ఫ్యాన్స్ ఉన్నారు. టెంపర్ సినిమాలో... "ఇట్టాగె రెచ్చిపోనా" ఐటెం సాంగ్‌లో రెచ్చిపోయి డాన్స్ చేసి... తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగుతోపాటూ... మలయాళ సినిమాలు కూడా చేసిన నోరా... ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఈ ఏడాది భారత్, బాట్లా హౌస్‌ సినిమాల్లో సందడి చేసిన నోరా... తాజాగా మర్జావాన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం స్ట్రీట్ డాన్సర్ మూవీ షూట్‌లో బిజీగా ఉంది. అందులో భాగంగానే... డాన్స్ స్టెప్పులు ఇరగదీస్తోంది. ఆ వీడియోలను షేర్ చేస్తూ... ఫ్యాన్స్‌కి ఫెస్టివల్ చేస్తోంది.



 




Loading...

View this post on Instagram




 

Pyar do pyar lo 😉 Marjaavan is out in cinemas today guys you can now watch the song in a cinema near you ❤️🔥 Love this vfx edit by @letsvfx thank u 🙏🏽 @tanishk_bagchi @nehakakkar @sidmalhotra @milapzaveri @tseriesfilms @emmayentertainment @livedancefit @tejasdhoke @ishpreet_dang @tseries.official


A post shared by Nora Fatehi (@norafatehi) on





మొరాకో, కెనడా ఫ్యామిలీకి చెందిన నోరా... ప్రస్తుతం తనది ఇండియన్ హార్టే అంటోంది. పుట్టి, పెరిగిందంతా కెనడాలోనే అయినా... బాలీవుడ్‌కి వచ్చాక... ఇక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్‌లో రోర్... టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నోరా... తెలుగులో టెంపర్, బాహుబలి, కిక్-2 సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి... పాపులార్టీ సంపాదించుకుంది. ఇక మలయాళంలో డబుల్ బ్యారెల్, కయంకుళం కోచున్నీ సినిమాల్లో నటించింది.



2016లో బిగ్ బాస్ 9లో డే 84లో తళుక్కుమన్న నోరా... టీవీ రియాల్టీ డాన్స్ షో ఝలక్ దిఖలా జా లో కూడా పాల్గొంది. తాజాగా టీ-సిరీస్‌తో డీల్ కుదుర్చుకున్న ఫతేహీ... త్వరలో టీ-సిరీస్ మూవీస్, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చెయ్యబోతోంది.

 

Pics : సన్నబడిన ఇలియానా హాట్ అందాలు చూసి తీరాల్సిందే




ఇవి కూడా చదవండి :

పులి చర్మం డ్రెస్‌లో ఇలియానా... సోషల్ మీడియా షేక్...

టార్గెట్ రాహుల్... నేడు బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు

మహారాష్ట్రలో మళ్లీ రాజకీయం... నేడు గవర్నర్‌ను కలవనున్న ఎన్సీపీ, శివసేన

నేటి నుంచీ ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు

Health Tips : ఎముకలను దృఢంగా మార్చే టీ... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : పీచ్ ఫ్రూట్ తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...

First published: November 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...