• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NOEL SPECIAL POST FOR ABIJEET HARIKA AND LASYA MNJ

Bigg Boss 4: అభి ట్రోఫీతో వ‌చ్చేయ్‌ పార్టీ చేసుకుందాం.. హారిక‌, లాస్య రెడీగా ఉండండి.. నోయ‌ల్ పోస్ట్

Bigg Boss 4: అభి ట్రోఫీతో వ‌చ్చేయ్‌ పార్టీ చేసుకుందాం.. హారిక‌, లాస్య రెడీగా ఉండండి.. నోయ‌ల్ పోస్ట్

నోయల్ హారిక అభిజీత్ లాస్య

బిగ్‌బాస్ 4(Bigg Boss 4 Telugu) స‌మ‌రం తుది ఘట్టానికి వ‌చ్చేసింది. మ‌రికొన్ని గంట‌ల్లో విజేత ఎవ‌రో తేల‌నున్నారు. లీకువీరుల స‌మాచారం ప్రకారం టాప్ 5లో ఉన్న అరియానా, హారిక ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తుండ‌గా

  • Share this:
    Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ 4 స‌మ‌రం తుది ఘట్టానికి వ‌చ్చేసింది. మ‌రికొన్ని గంట‌ల్లో విజేత ఎవ‌రో తేల‌నున్నారు. లీకువీరుల స‌మాచారం ప్రకారం టాప్ 5లో ఉన్న అరియానా, హారిక ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తుండ‌గా.. అభిజీత్, సొహైల్, అఖిల్ మ‌ధ్య గ‌ట్టి పోటీ జ‌ర‌గ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో అభిజీత్‌నే విన్న‌ర్‌గా గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు టాక్. కాగా ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఈ సీజ‌న్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌ల‌తో పాటు టాప్ 5 కంటెస్టెంట్‌ల కుటుంబ స‌భ్యులు సంద‌డి చేయ‌నున్నారు. అలాగే ఈ ఫినాలే కోసం మెగాస్టార్ చిరంజీవి స‌హా అనిల్ రావిపూడి, థ‌మ‌న్, ప్ర‌ణీత‌, మెహ్రీన్ త‌దిత‌రులు రానున్నారు. ఇవాళ వారంతా స్టేజ్‌పైన సంద‌డి చేయ‌బోతున్నారు.

    కాగా విన్నింగ్ డే సంద‌ర్భంగా అభిజీత్, హారిక‌, లాస్య‌ల‌ను ఉద్దేశించి సింగ‌ర్ నోయ‌ల్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అభిజీత్ ల‌వ్ యూ. నిన్ను టైటిల్‌తో పాటు చూడాలి. మున్ముందు నీకు చాలా ల‌భించాలి. నీతో పాటు ఉన్న ప్ర‌తి నిమిషాన్ని నేను ఎంజాయ్ చేశా. నిన్ను హ‌గ్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నా. దా పార్టీ చేసుకుందాం. హారిక రెడీనా. ఇది మ‌నం డ్యాన్స్ చేసి సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన స‌మ‌యం. అంద‌రం తిరిగి క‌లుసుకోవాల్సిన స‌మ‌యం. లాస్య ఈ రోజు ఫుల్ ముచ్చ‌ట్లే. మ‌న ఙ్ఞాప‌కాల‌న్నీ గుర్తుచేసుకుందాం అని కామెంట్ పెట్టారు.








    View this post on Instagram






    A post shared by Noel (@mr.noelsean)






    అయితే ఈ సీజ‌న్‌లో నోయ‌ల్ కూడా ఒక కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. హౌజ్‌లోకి వెళ్లిన త‌రువాత లాస్య‌, అభిజీత్, హారిక‌, నోయ‌ల్ ఓ గ్యాంగ్ లా కొనసాగారు. ఇక హారిక, నోయ‌ల్‌ని త‌న నాన్న‌లా అనుకుంటాన‌ని ప‌లు సంద‌ర్భాల్లో తెలిపింది. కాగా హౌజ్‌లో రేలంగి మామ‌గా గుర్తింపు పొందిన నోయ‌ల్‌.. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు.

    ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన రోజే త‌న ఫ్రెండ్స్‌ని టాప్ 5లో ఉంచ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ఇప్ప‌టి నుంచి అదే ప‌నిమీద ఉంటాన‌ని చెప్పాడు. చెప్పిన‌ట్లుగానే అభిజీత్‌, హారిక‌, లాస్య‌ల‌కు బ‌య‌టి నుంచి మంచి మ‌ద్దతును ఇచ్చాడు. ఇక విన్న‌ర్‌గా గ‌త కొన్ని రోజులుగా అభిజీత్ పేరు వినిపిస్తోన్న క్ర‌మంలో.. త‌న ఫ్రెండ్‌నే ఈ సారి టైటిల్‌ని తీసుకొని వ‌స్తాడ‌ని ధీమాను వ్య‌క్తం చేస్తూ పోస్ట్ చేశాడు.
    Published by:Manjula S
    First published: