ఇంతవరకు ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు : రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ హిందీ సినిమా దేదే ప్యార్ దే ఇటీవలే విడుదలైంది. అజయ్ దేవ్‌గన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రకుల్ ప్రీత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్బంగా రకుల్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది.

news18-telugu
Updated: May 22, 2019, 4:19 PM IST
ఇంతవరకు ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు : రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ Photo: Twitter.com/Rakulpreet
news18-telugu
Updated: May 22, 2019, 4:19 PM IST
రకుల్ ప్రీత్ తెలుగులో వరుస సినిమాలతో ఇండస్ట్రీ ఓ ఊపు ఊపిన నటి. అయితే ప్రస్తుతం అమ్మడుకు అవకాశాలు తగ్గాయి. గతంలో ఆమె నటించిన సినిమాలు సరిగా ఆడకపోవడంతో తెలుగులో అవకాశాలు అంతంతమాత్రంగా వస్తున్నాయి. దీంతో హిందీ సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ భామ అజయ్ దేవగన్‌తో జంటగా ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం విడుదలైన మొదటి నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.44.73 కోట్లు రాబట్టింది. దీంతో కొత్త ఊపిరి పీల్చుకున్నట్లైంది రకుల్‌కు. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా ట్విటర్ వేదికగా రకుల్ నెటిజన్లతో ముచ్చటిస్తూ, వారు అడిగిన పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. అందులో భాగంగా తన ఇష్టమైన ప్రదేశం స్నేహితులు ఉన్న చోటు ఏదైనా తనకు ఇష్టమే అంటూ సమాధానం ఇచ్చింది. సమంత గురించి మీ కామెంట్ ఎంటని అని అడిగిన ప్రశ్నకు సమాదానంగా నాకు సమంత అంటే ఇష్టం అంటూ.. ఆమె పవర్ ఉమన్ అని జవాబు ఇచ్చారు.

మన్మథుడు 2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోంది అన్న ప్రశ్నకు సమాదానంగా.. అద్భుతంగా జరుగుతోంది అంటూ.. సెట్ మొత్తం ఫన్, పాజిటివిటీతో నిండిపోయి ఉంటోంది అంటూ సమాధానమిచ్చింది. అయితే ఒక నెటిజెన్ మాత్రం ఓ కొంటే ప్రశ్న అడుగుతూ.. ఎంతమంది మీకు లవ్ ప్రపోజ్ చేసారు ఇప్పటి వరకు అని అడగ్గా.. “ఇంత వరకు ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు” అని సమాధానం ఇచ్చింది రకుల్. రాజమౌళితో సినిమా చేసే అవకాశం ఒస్తే వెంటనే ఒప్పేసుకుంటా అంటూ మరో ప్రశ్నకు సమాదానంగా చెప్పింది.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...