ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హ్యాండ్ ఇచ్చిన రాజమౌళి..

ఎన్టీఆర్ Photo : Twitter

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా సీతారామరాజు గా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. దీనికి తోడు ఎన్టీఆర్ తెలంగాణ యాసలో వాయిస్ ఓవర్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉండనున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. చరణ్ ఇంట్రడక్షన్ సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరుణంలో ఫ్యాన్స్ అంతకు మించిన స్థాయిలో ఎన్టీఆర్ ఉండాలనీ కోరుకున్నారు. కాగా ఎన్టీఆర్ ఇంట్రోకి సంబందించి పూర్తి మెటీరియల్ లేదని.. లాక్ డౌన్ కారణంగా కొన్ని సీన్స్ షూట్ చేయలేదని.. ఏదో నామామాత్రంగా పుట్టినరోజు సందర్భంగా వీడియో విడుదలచేయడం బాగుండదంటూ ఓ నోట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.  ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిఉంది. అయితే బహుశా విడుదల తేదిలో మార్పు ఉండోచ్చని సమాచారం. ఇక కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. తర్వాత షెడ్యూల్ పూణేలో మొదలుకానుంది.    Published by:Suresh Rachamalla
    First published: