హోమ్ /వార్తలు /సినిమా /

ప్రభాస్‌కు అవమానం... మరీ ఇంత ఘోరమా?

ప్రభాస్‌కు అవమానం... మరీ ఇంత ఘోరమా?

సాహో సినిమాను టీవీలో ప్రసారం చేసే హక్కుల కోసం గతంలో చాలా మంది పోటీ పడ్డారు. సుమారు రూ.90కోట్ల మేర మార్కెట్ వచ్చింది.

సాహో సినిమాను టీవీలో ప్రసారం చేసే హక్కుల కోసం గతంలో చాలా మంది పోటీ పడ్డారు. సుమారు రూ.90కోట్ల మేర మార్కెట్ వచ్చింది.

సాహో సినిమాను టీవీలో ప్రసారం చేసే హక్కుల కోసం గతంలో చాలా మంది పోటీ పడ్డారు. సుమారు రూ.90కోట్ల మేర మార్కెట్ వచ్చింది.

    బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఓ రకంగా తీవ్ర అవమానం జరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా విషయంలోనే ప్రభాస్‌కు ఈ అవమానం ఎదురైంది. సాహో సినిమా రిలీజ్‌కు ముందు భారీ క్రేజ్ వచ్చింది. అయితే, దాన్ని నిర్మాతలు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అప్పుడు వారు వేసిన ఓ అడుగు ఇప్పుడు ప్రభాస్ నిర్మాతలకు కష్టాలను, యంగ్ రెబల్ స్టార్‌కు అవమానాన్ని మిగిల్చింది.

    సాహో సినిమాను టీవీలో ప్రసారం చేసే హక్కుల కోసం గతంలో చాలా మంది పోటీ పడ్డారు. సుమారు రూ.90కోట్ల మేర మార్కెట్ వచ్చింది. దీంతో అంత ధర పెట్టి కొనడానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు కొంత జంకాయి. అయితే, హిందీలో మాత్రం ఓ ఛానల్ టీవీ ప్రసార హక్కులను కొనుక్కుంది. కానీ, తెలుగు రైట్స్ మాత్రం విక్రయించలేదు. సాహో సినిమా తెలుగులో అనుకున్నంత లాభాలు తెచ్చిపెట్టలేదు. దీంతో సినిమా రిలీజ్ తర్వాత దాన్ని కొనేందుకు టీవీ ఛానల్స్ కొంచె సంకోచించాయి. అదే సమయంలో డిజిటల్ మీడియా అమెజాన్‌లో సాహో టెలికాస్ట్ అయిపోయింది. దీంతో ఇప్పుడు రేటు తగ్గించినా కూడా ఏ తెలుగు టీవీ ఛానల్స్ కూడా సాహో సినిమాను కొనేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది.

    First published:

    Tags: Prabhas saaho, Sahoo, Tollywood Movie News

    ఉత్తమ కథలు