జబర్దస్త్ షో( Jabardasth Show)కు రోజా(Roja) దూరమైన విషయం తెలిసిందే. ఆమెకు మంత్రి పదవి రావడంతో రోజా ఇకపై టీవీ షోలు చేయనని తేల్చేశార. అయితే రోజా ఇకపై జబర్దస్త్‌లో కనిపించరని జబర్దస్త్ షో కమెడియన్ అప్పారావు( Apparao) ఇటీవలే ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. జబర్దస్త్‌లో తరచూ జడ్జీలు మారుతూనే వస్తూనే ఉన్నారన్నారు. రోజాకు కేబినెట్ పదవి వస్తుందని ఆమె ఇక జబర్దస్త్‌లో కనిపించరని ఆయన ఇంటర్య్వూలో తెలిపారు. ఆమె అత్యంత ప్రజాదారణ ఉన్న మహిళా ఎమ్మెల్యే అన్నారు. రోజా(Roja) గారికి హెల్త్ బాగాలేనప్పుడు ఇంద్రజ గారు జడ్జీగా చేశారన్నారు. రోజా గారు వద్దని .. అప్పట్లో ఇంద్రజగారే జడ్జీగా కావాలని వచ్చిన ట్రోలింగ్‌పై ఆయన స్పందించారు. అవన్నీ అబద్ధాలన్నారు. రోజా గారు రోజగారే అన్నారు. గ్లామర్ ప్రపంచంలో రూమర్లు కూడా అంతే ఫాస్ట్‌గా వస్తాయన్నారు అప్పారావు.
జబర్దస్త్ షోలో రోజా గారికి అల్ట్రేనేటివ్ లేరని తాను చెబుతానన్నారు. నాగబాబు(Nagababu) గారికి నో మోర్ అల్ట్రేనేటివ్ అని చెబుతానన్నారు. ఎందుకంటే వారిద్దరూ కేవలం జడ్జీలు మాత్రమేకాదన్నారు. వారిద్దరూ జబర్దస్త్‌ను ప్రేమించారన్నారు. గౌరవించారన్నారు. రాత్రి 11 గంటల వరకు ఉండి మా కష్టాన్ని చూసేవారన్నారు. నాగబాబు.. అన్నగారు చిరంజీవి(Chiranjeevi) గారు పేరు మీద.. మెగా విన్నర్ అని స్కిట్ చేసిన వారికి రూ.పదివేలు ఇచ్చేవారన్నారు.
ఏపీ టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా రోజా(Minister Roja) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రోజాకు మంత్రి పదవి రాగానే వెండితెరతో పాటు బుల్లితెరకు కూడా గుడ్ బై చెప్పేశారు. 2013 ఫిబ్రవరి 7 నుంచి ఇప్పటివరకూ జబర్దస్త్ షోకి ఎంతో మంది జడ్జీలు వచ్చారు వెళ్లారు.. కానీ రోజా మాత్రం దాదాపు పదేళ్లుగా జడ్జీగానే కంటిన్యూ అవుతూనే ఉన్నారు.
2019 తరువాత నాగబాబు(Nagababu) జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయారు. అప్పుడు కూడా రోజా సింగిల్ హ్యాండ్‌తోనే షోను నడిపారు. దీంతో రోజా అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే రోజా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. రోజా జబర్దస్త్ జడ్జీగా దాదాపు 450 ఎపిసోడ్లకు వ్యవహరించారు. మరి అలాంటి పరిస్థితుల్లో రోజా ఈ షో నుంచి వెళ్లిపోవడం నిజంగా జబర్దస్త్‌కు తీరని లోటు. ఆ లోటను ఎవరు కూడా రీ ప్లేస్ చేయలేరనే చెప్పాలి. మరి రోజా స్థానంలో జబర్దస్త్‌కు ఎవరు వస్తారో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardast comedian, Jabardasth, MLA Roja, Rk roja