NO NATIONAL AWARD FOR MANIKARNIKA WILL QUESTION THEIR CREDIBILITY NATIONAL FILM AWARD JURY KANGANA RANAUT TA
జాతీయ అవార్డు కమిటీతో పాటు.. దక్షిణాది ప్రజలపై కంగనా సంచలన వ్యాఖ్యలు..
కంగన రనౌత్ ఫైల్ ఫోటో
కంగన రనౌత్.. ఈ పేరు వింటే ముందుగా నటన కంటే కూడా వివాదాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఎందుకంటే కెరీర్ మొదటి నుంచి కాంట్రవర్సీలతో అంతగా స్నేహం చేస్తూ వచ్చింది కంగన రనౌత్. తాజాగా ఈ భామ మణికర్ణిక సినిమాకు జాతీయ అవార్డు రాకపోతే ..ఆ అవార్డుల విశ్వసనీయతను ప్రశ్నించాల్సి వస్తుందన్నారు.
కంగన రనౌత్.. ఈ పేరు వింటే ముందుగా నటన కంటే కూడా వివాదాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఎందుకంటే కెరీర్ మొదటి నుంచి కాంట్రవర్సీలతో అంతగా స్నేహం చేస్తూ వచ్చింది కంగన రనౌత్. ఇప్పటికీ ఈమె సినిమాల కంటే కూడా వివాదాలే ఎక్కువగా ఈమెకు క్రేజ్ తీసుకొచ్చాయి. మొన్నటికి మొన్న మణికర్ణిక సినిమాతో కూడా కాంట్రవర్సీనే కోరి తెచ్చుకుంది కంగన. ముఖ్యంగా డైరెక్షన్ క్రెడిట్ విషయంలో దర్శకుడు క్రిష్,కంగనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇక ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో తన నటనతో వివాదం చేసే వాళ్లు నోళ్లు మూయించింది. కంగన. ఓ వైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్.. ఇంకోవైపు దర్శకత్వం ఇలా అన్నింట్లోనూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.తాజాగా ఈ భామ తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడతూ ఒకవేళ ‘మణికర్ణిక’ సినిమాలోని నటనకు తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రాకపోతే.. జాతీయ అవార్డుల విశ్వసనీయతను అనుమానానించాల్సి వస్తోంది అని జాతీయ అవార్డుల జ్యూరీపై తనదైన శైలిలో స్పందించింది.
మణికర్ణిక మూవీ సెట్స్
దాంతో పాటు జయలలిత జీవితంపై తెరకెక్కుతోన్న బయోపిక్ లో నటించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. మరోవైపు దక్షిణాది ప్రజలు వాళ్ల లోకల్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతారు. నార్త్ సినిమాలను ఎక్కువగా చూడరన్నారు. దీంతో వాళ్లు మొత్తం దేశానికే దూరమవుతున్నారన్నారు. నాకు తమిళ్, తెలుగు సినిమాల్లో నటించడమంటే ఇష్టం. ఆయా సినిమాల్లో నటించడం ద్వారా అక్కడ ప్రజలకు మరింత చేరువ కావచ్చొనన్నారు.ఈ సినిమాలో నటించేందకు కంగనా రూ. 24 కోట్ల పారితోషకం తీసుకుంటోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
జయ లలిత పాత్రలో కంగనా రనౌత్
ఇప్పటికే కంగనా రనౌత్.. ‘ష్యాషన్’ సినిమాలోని నటనకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయనటి అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత ‘క్వీన్’,‘తను వెడ్స్ మను రిటర్న్స్’ సినిమాలో నటనకు గాను రెండు సార్లు ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అంతేకాదు ఒకవేళ బెట్టర్ పర్ఫామ్ చేసినవాళ్లు ఉంటే అవార్డు వాళ్లకు ఇవ్వొచ్చు అంటూ సమాధాన మిచ్చింది.
కంగన రనౌత్ ఫైల్ ఫోటో
నా అంచనాల ప్రకారం 2018 ఏడాది కాను ‘అందాధున్’ సినిమలో నటనకు టబు జాతీయ అవార్డు ఖచ్చితంగా వచ్చే అవకాశాం ఉందని చెప్పారు. ఈ ఇయర్ రిలీజైన మణికర్ణిక విషయానికొస్తే..వచ్చే ఏడాది తెలుస్తుందన్నారు. ప్రస్తుతం కంగనా కోయింబత్తుర్లో మెడిటేషన్ కోర్స్ పూర్తి చేసుకొని వచ్చింది. ప్రస్తుతం కంగానా జయలలిత పాటు ‘మెంటల్ హై క్యా’ సినిమాలో నటించింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.