హోమ్ /వార్తలు /సినిమా /

నాగార్జున మరోసారి అలాంటి సాహసం చేస్తాడా.. అభిమానులు ఒప్పుకుంటారా..

నాగార్జున మరోసారి అలాంటి సాహసం చేస్తాడా.. అభిమానులు ఒప్పుకుంటారా..

నాగార్జున అక్కినేని (Instagram/Photo)

నాగార్జున అక్కినేని (Instagram/Photo)

గత యేడాది నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న‘మన్మథుడు 2’ ఆయన ఆశలపై నీళ్లు జల్లింది. ఈ సినిమా తర్వాత నాగార్జున సైలెంట్‌గా ‘వైల్డ్ డాగ్’ అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం నాగార్జున..

గత యేడాది నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న‘మన్మథుడు 2’ ఆయన ఆశలపై నీళ్లు జల్లింది. ఈ సినిమా తర్వాత నాగార్జున సైలెంట్‌గా ‘వైల్డ్ డాగ్’ అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాగ్.. ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో కనిపించున్నాడు. ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు సోలోమెన్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాడు. కొత్త వాళ్లను నమ్మడం నాగార్జునకు ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు కొత్త దర్శకులే నాగ్ కెరీర్‌ను మార్చేసే విజయాలు అందించారు. కథ ప్రకారం ఈ చిత్రంలో నాగార్జునకు హీరోయిన్ ఉండదని సమాచారం. కానీ ఈ చిత్రంలో  దియా మీర్జా నటిస్తోన్న నాగ్‌కు జోడిగా నటించడం లేదని టాక్.  అంతేకాదు ఈ చిత్రంలో పాటలు కూడా లేకుండా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో నాగార్జున ‘గగనం’, ‘శిరిడిసాయి’ చిత్రాల్లో హీరోయిన్ లేకుండా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు చాలా రోజుల తర్వాత కథానాయిక లేకుండా సోలో‌గా వెండితెరపై తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నడన్న మాట. మరి ఈ సారైనా నాగార్జున మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతాడా అన్నది చూడాలి.

First published:

Tags: Nagarjuna Akkineni, Telugu Cinema, Tollywood, Wild Dog Movie

ఉత్తమ కథలు