‘సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్టీ దాడులు...’ మీడియాపై మండిపడిన యాంకర్లు...

అనసూయ, సుమ సవాల్ (suma anasuya)

సుమ కనకాల, అనసూయ భరద్వాజ్ ఇళ్లలో జీఎస్టీ దాడులు జరిగాయంటూ వార్తలు రావడంతో వారిద్దరూ మండిపడ్డారు.

  • Share this:
    ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయ భరద్వాజ్ కొన్ని మీడియా హౌస్‌ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమ, అనసూయతో పాటు మరికొందరి ఇళ్ల మీద జీఎస్టీ దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. టీవీ, పేపర్, డిజిటల్, సోషల్ మీడియాలో ఈ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి. వీటిపై యాంకర్ సుమ, అనసూయ ఘాటుగా స్పందించారు. ‘మా ఇంటి మీద జీఎస్టీ దాడులు జరిగినట్టు ప్రచారం జరిగింది. ఏ ఇల్లు? ఎక్కడ ఇల్లు? నేను జీఎస్టీని తప్పనిసరిగా కడుతున్నా. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. నా గురించి చెత్త రాసేటప్పుడు కొన్ని న్యూస్ పేపర్లు ఆ వార్త వాస్తవమా? కాదా అని ఎందుకు క్రాస్ చెక్ చేసుకోరు.’ అని యాంకర్ సుమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.    మరోవైపు యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా మీడియాకు చురకలు అంటించింది. తమ ఇంటి మీద ఏ ప్రభుత్వ సంస్థ కూడా దాడులు చేయలేదని స్పష్టం చేసింది. ‘మీడియా అనేది జరిగిన వార్తలను చేరవేయడానికి. అంతేకానీ, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రచారం చేయడానికి కాదు. వినోద రంగంలో ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి పేరు సంపాదించుకుంటున్నారు. పవర్ ఫుల్ మీడియా సమాజాన్ని మంచిగా ముందుకు నడిపించడానికి పనిచేయాలి. అంతే కానీ, ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును చెడగొట్టేలా వ్యవహరించకూడదు.’ అంటూ అనసూయ కూడా మరో ట్వీట్ చేసింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: