హోమ్ /వార్తలు /సినిమా /

Theatres Collections: థియేటర్స్ విషయంలో అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. కలెక్షన్స్ ఎక్కడ..?

Theatres Collections: థియేటర్స్ విషయంలో అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. కలెక్షన్స్ ఎక్కడ..?

4. సింగిల్‌ థియేటర్లలో రిక్లైనర్‌ సీట్స్‌ ఉంటే గరిష్ఠంగా రూ.200+GST.. మల్టీప్లెక్స్‌లో రిక్లైనర్స్‌కు గరిష్ఠంగా రూ.300+GST

4. సింగిల్‌ థియేటర్లలో రిక్లైనర్‌ సీట్స్‌ ఉంటే గరిష్ఠంగా రూ.200+GST.. మల్టీప్లెక్స్‌లో రిక్లైనర్స్‌కు గరిష్ఠంగా రూ.300+GST

Theatres Collections: కర్ణుడి చావుకు లక్ష కారణాలున్నట్లు ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ చేసినా కలెక్షన్స్ రాకపోవడానికి కూడా అన్నే కారణాలు కనిపిస్తున్నాయి. క్రేజీ సినిమాలు వచ్చిన కూడా కలెక్షన్స్ మాత్రం ముందులా వచ్చేలా కనిపించడం లేదు.

కర్ణుడి చావుకు లక్ష కారణాలున్నట్లు ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ చేసినా కలెక్షన్స్ రాకపోవడానికి కూడా అన్నే కారణాలు కనిపిస్తున్నాయి. క్రేజీ సినిమాలు వచ్చిన కూడా కలెక్షన్స్ మాత్రం ముందులా వచ్చేలా కనిపించడం లేదు. గతవారం జులై 30న సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమాకు మంచి టాక్ వచ్చింది. డీసెంట్ థ్రిల్లర్ అంటూ ఆడియన్స్ కూడా ఒప్పుకున్నారు. కానీ కలెక్షన్స్ చూస్తే మాత్రం నిల్. మూడు రోజుల తర్వాత వీకెండ్ కలెక్షన్స్ చూసుకుంటే నిర్మాతలకు రక్తకన్నీరు తప్ప మరోటి కనిపించడం లేదు. అయితే అది వాళ్ల తప్పు కూడా కాదు. ఏం చేయలేని నిస్సహాస స్థితిలో అటు డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఇటు నిర్మాతలు కానీ ఉండిపోయారు. తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు లేకుండా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ టికెట్ రేట్స్ కూడా ముందులాగే ఉన్నాయి.

అదే ఏపీలో మాత్రం చాలా కండీషన్స్ ఉన్నాయి. అక్కడ 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ ఓపెన్ చేసారు. దాంతో పాటు కొన్నిచోట్లు ప్రత్యేక పరిస్థితుల కారణంగా థియేటర్స్ ఓపెన్ చేయలేదు. అన్నింటికి మించి మొన్న జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్‌పై కొరడా ఝలిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్స్ అమ్మాలని.. అలా కాదని ఎక్కువ రేట్స్‌కు అమ్మితే తీవ్ర చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.

movie theatres,movie theatres collections,movie theatres no collections,no movies to releases,ticket prices in movie AP theatres,telugu cinema,థియేటర్స్,థియేటర్స్ నో కలెక్షన్స్,థియేటర్స్ కలెక్షన్స్
సినిమా థియేటర్స్ (Movie Theatres)

దాంతో టికెట్ రేట్స్ ఎక్కడా 80 రూపాయలు కూడా లేవిప్పుడు. 20, 30, 50, 70 రూపాయల టికెట్స్ రేట్స్‌తో సినిమాలు విడుదల చేస్తే తమకు నష్టాలు తప్పవంటున్నారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడాలని ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఆగస్టులోనే థర్డ్ వేవ్ ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు వచ్చేసాయి. కేరళ లాంటి రష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా పెట్టేస్తున్నారు. ఇప్పటికీ దేశంలో 40 వేలకు పైగానే పాజిటివ్ కేసులు వస్తున్నాయి.

movie theatres,movie theatres collections,movie theatres no collections,no movies to releases,ticket prices in movie AP theatres,telugu cinema,థియేటర్స్,థియేటర్స్ నో కలెక్షన్స్,థియేటర్స్ కలెక్షన్స్
సినిమా థియేటర్స్ (Movie Theatres)

దాంతో ఈ భయంలో థియేటర్స్ వరకు ప్రేక్షకులు చిన్న సినిమాలు చూడటానికి రారు. మరోవైపు పెద్ద సినిమాలు విడుదల చేస్తారేమో అనుకుంటే.. ఏపీలో టికెట్ రేట్స్ అడ్డుగా కనిపిస్తున్నాయి. మరి ఇన్ని సమస్యల మధ్య థియేటర్ వ్యవస్థ బతకడం అంటే చాలా కష్టం. దీనిపై వెంటనే ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Theatres, Tollywood

ఉత్తమ కథలు