పాపం షాలినీ పాండే.. అలా నటిస్తానన్న అర్జున్ రెడ్డి భామను ఎవ్వరూ కేర్ చేయడం లేదు..

‘అర్జున్  రెడ్డి’సినిమాలో  ‘ముద్దు’లతో కుర్రకారు మనసు దోచుకుంది షాలిని పాండే. ఈ సినిమా రిలీజైన తర్వాత.. విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో..అందులో హాట్ హాట్‌గా నటించిన షాలీనీ పాండేకు అంతే క్రేజ్ వచ్చింది.  తాజాగా ఈ భామ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

news18-telugu
Updated: July 12, 2019, 8:28 PM IST
పాపం షాలినీ పాండే.. అలా నటిస్తానన్న అర్జున్ రెడ్డి భామను ఎవ్వరూ కేర్ చేయడం లేదు..
షాలినీ పాండే
  • Share this:
‘అర్జున్  రెడ్డి’సినిమాలో  ‘ముద్దు’లతో కుర్రకారు మనసు దోచుకుంది షాలిని పాండే. ఈ సినిమా రిలీజైన తర్వాత.. విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో..అందులో హాట్ హాట్‌గా నటించిన షాలీనీ పాండేకు అంతే క్రేజ్ వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా తరువాత తమిళంలో వరుసగా నాలుగైదు సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ బిహారీ భామ తెలుగులో మాత్రం ఎవ్వరిని సరిగా ఇంప్రెస్ చేయలేక వెనకబడి పోయింది.  అప్పట్లో నటన అంటే ఒక ప్యాషన్ అని చెప్పుకొచ్చింది.అది  ఉంటేనే చేసే పాత్రకు పూర్తి న్యాయం చేయగలమని అదిలేకపోతే సీన్ పండదని.. ఆ సన్నివేశం ముద్దు సీన్ అయినా.. మరే ఇతర సీన్ అయినా సరే ... అంటూ తనకు బోల్డ్ గా నటించేందుకు ఏ అభ్యంతరం లేదంటూ బాహాటంగానే చెప్పింది.

Arjun Reddy Fame Shalini pandey Hot Photo Shoot,shalini pandey,shalini,shalini pandey age,shalini pandey hot,shalini pandey kiss,shalini pandey cars,shalini pandey wiki,shalini pandey facts,shalini pandey award,shalini pandey family,shalini pandey weight,shalini pandey height,shalini pandey career,shalini pandey husband,shalini pandey net worth,shalini pandey lifestyle,shalini pandey biography,shalini pandey boyfriend,shalini pandey latest interview,Pics : బ్లాక్ బ్రాస్ లో మెరిసిపోతున్న అర్జున్ రెడ్డి భామ,tollywood actress shalini pandey pics
షాలినీ పాండే హాట్ ఫోటోస్


తనతో లిప్ లాక్ సీన్స్ చేసిన విజయ్ దేవరకొండ స్టార్ గా ఎదుగుతుంటే..అలాంటి సన్నివేశాలలో నటించేందుకు ఏమాత్రం సంకోచించను అని చెబుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదు ఈ బ్యూటీ ని.  మరోవైపు షాలినీ పాండే..‘మహానటి’, ‘118’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లో నటించినా అవి  గెస్ట్ పాత్రలు కావడం కొసమెరుపు. నిజానికి తెలుగులో కమర్షియల్ హీరోయిన్‌గా చేయడానికి చాలా రోల్స్ శాలినిని వరించినా, ఎందుకో శాలిని వాటిని అంగీకరించ లేదట. నా పాత్ర తాలూకు తీరుతెన్నులేంటి, కథలో నా రోల్ ఏంటి, రోల్‌లో డెప్త్ ఏంటి వంటి యక్ష ప్రశ్నలు అడగటంతో, తెలుగు దర్శకులు చాలామంది ఆమెను పక్కనెట్టేస్తున్నారని ఒక టాక్ వినిపిస్తోంది .త్వరలో రాజ్ తరుణ్‌ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో నటించనున్న షాలిని పాండే ప్రస్తతం హాట్ గ్లామర్ ఫోటో షూట్‌తో నెట్టుకొస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 12, 2019, 8:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading