Home /News /movies /

NKR NANDAMURI KALYAN RAM BIMSARA TRAILER TALK REVIEW TA

Kalyan Ram - Bimbisara Trailer Talk : కళ్యాణ్ రామ్ ’బింబిసార’ ట్రైలర్ టాక్.. బార్బేయన్ కింగ్‌గా నందమూరి హీరో..

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ట్రైలర్ టాక్ (Twitter/Photo)

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ట్రైలర్ టాక్ (Twitter/Photo)

Kalyan Ram As Bimbisara Trailer Talk | నంద‌మూరి కథానాయకుల్లో హిట్ ప్లాపులకు  సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో క‌ల్యాణ్‌రామ్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌‌ను ఆయన బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందు విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    Kalyan Ram As Bimbisara Trailer Glimpse | నంద‌మూరి  కథానాయకుల్లో  సక్సెస్‌ ప్లాపులకు  సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో క‌ల్యాణ్‌రామ్‌ (Kalyan Ram ). ఇతను హీరోగానే  కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా. తాజాగా ఆయన హీరోగా నిర్మిస్తూ నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’ (Bimbisara) .  ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది.ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు.

    ఈ చిత్రం ‘మగధీర’ లెవల్లో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. రాక్షసులు ఎరగని రావణ రూపం. శతృవులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. త్రిగర్తల సామ్రాజ్యధినేత బింబిసారుడి విశ్వరూపం. బింబిసారుడు అంటేనే మరణ శాసనం తో పాటు  ఇక్కడ రాక్షసుడైనా.. భగవంతుడైనా బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగులు బాగున్నాయి.


    ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్2కు  మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో  తెరకెక్కించారు. బార్బేయన్ కింగ్ బింబిసారుడు దాచి పెట్టిన నిధి సొంతం చేసుకోవడానికీ కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పన్నుతాయి. వారి ఆటలను బింబిసారుడుగా జన్మించిన కళ్యాణ్ రామ్ ఏ రకంగా అంతం చేసాడనేదే ఈ సినిమాగా కనబడుతోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కోసం బాగానే ఖర్చు పెట్టారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ గెటప్ పర్వాలేదనిపిస్తోంది. ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటోందో అని డైలాగులు పేలాయి.   ‘ఎంత మంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న  సినిమా ‘బింబిసార’.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.



    ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్‌‌లో ‘ఏ టైమ్ ట్రావెల్‌ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైగ్. జూలై 5న కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగా బర్త్ డే కానుకగా బింబిసార ట్రైలర్ విడుదల చేసారు.

    Tollywood hero divorce: విడాకులు దిశగా టాలీవుడ్ యంగ్ హీరో.. భార్యతో కలిసుండలేను.. ?


    ఇక కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ (Bimbisara) మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bimbisara Movie, Kalyan Ram Nandamuri, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు