అలాంటి రోల్స్‌ చేయడానికి సిద్ధమే : నివేదా పేతురాజ్..

Nivetha Pethuraj : 'మెంటల్ మదిలో' సినిమాతో  తెలుగుతెరకు పరిచయమైంది అందాల నివేదా పేతురాజ్.

news18-telugu
Updated: May 22, 2020, 9:48 AM IST
అలాంటి రోల్స్‌ చేయడానికి సిద్ధమే : నివేదా పేతురాజ్..
నివేధా పేతురాజ్ Photo : Twitter
  • Share this:
Nivetha Pethuraj : 'మెంటల్ మదిలో' సినిమాతో  తెలుగుతెరకు పరిచయమైంది అందాల నివేదా పేతురాజ్. ఆ సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా అదరగొట్టింది. దీంతో పాటు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో కొంత హాట్‌గా కనబుడుతూ కనువిందు చేసింది నివేదా. ప్రస్తుతం నివేదా రామ్ హీరోగా వస్తోన్న రెడ్ సినిమాలో నటిస్తోంది. అది అలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో నివేదా మాట్లాడుతూ.. తమిళంలో నేను ఇంతవరకూ చేసిన పాత్రల కారణంగా గ్లామరస్ గా కనిపించవలసిన అవసరం రాలేదు. ఇక తెలుగులోను 'అల వైకుంఠపురములో' వరకూ నేను గ్లామరస్ గా కనిపించలేదు. పాత్రకి అవసరం అనుకుంటే అందాలు ఆరబోయడానికి నేను సిద్ధంగానే వున్నాను. అయితే అందాలు ఆరబోస్తేనే అవకాశాలు వస్తాయని నమ్మే వ్యక్తిని కాదని చెబుతోంది. కానీ పాత్రకి తగినట్టుగా కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కోంది. కాగా తాజాగా ఈ భామకు మరో ఆఫర్ వచ్చిందట.. పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో ఓ సెకండ్ హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్లు సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: May 22, 2020, 9:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading