• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NIVETHA PETHURAJ GOT BITTER EXEPERIENCE BY SWIGGY ORDER AFTER FINDING COCKROACH TA

Nivetha Pethuraj: హీరోయిన్ నివేదా పేతురాజ్ చేదు అనుభవం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

నివేథా పేతురాజ్ (Instagram/Photo)

Nivetha Pethuraj: హీరోయిన్ నివేదా పేతురాజ్ చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Nivetha Pethuraj: హీరోయిన్ నివేదా పేతురాజ్ చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..  రీసెంట్‌గా నివేదా పేతురాజ్..  ఆన్‌లైన్‌లో యాప్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. తీరా తిందామని ఫుడ్ ప్యాకెట్ చేస్తే అందులో బొద్దింక దర్శన ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైయింది. వెంటనే తేరుకొని తాను ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన రెస్టారెంట్‌తో పాటు, ఫుడ్ డెలవరి యాప్ స్విగ్గీపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని నివేదా పేతురాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.చెన్నైలో ఓ ఫేమస్ రెస్టారెంట్‌లో నివేదా పేతురాజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. ఫుడ్ డెలివరి తర్వాత ప్యాక్ ఓపెన్ చేయగానే నివేదాకు ఫ్రైడ్ రైస్‌ల ో బొద్దింక కనిపించడంతో రెస్టారెంట్‌ను ట్యాగ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. గత కొంతకాలంలో హోటళ్లలో సరైన శుచి, శుభ్రత పాటించడం లేదనడానికి నాకు డెలివరి చేసిన ఫ్రైడ్ రైస్‌లో బొద్దింక ఉండటమే ఓ నిదర్శనం అంది.

    ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. నేను ఆర్డర్ ఇచ్చిన మీల్స్‌లో కాక్రోచ్ వచ్చింది. దీన్ని బట్టి నేను ఆర్డర్ చేసిన హోటల్ వాళ్లు శుభ్రత విషయంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విషయం స్పష్టమైంది అంది. ప్రజల ఆరోగ్యాలతో ఆటాలడుకుంటున్న ఇలాంటి హోటల్స్ పై భారీగా పెనాల్టీ వేయాలన్నారు.

    నివేదా పేతురాజ్‌ ఫుడ్‌లో బొద్దింక (Instagram/Photo)


    నివేదా పేతురాజ్  సినిమాల విషయానికొస్తే.. తమిళ సినిమా.. ‘ఓరు నాల్ కొథు’ సినిమాతో పరిచమైన ఈ భామ.. తెలుగులో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో శ్రీ విష్ణు‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఓ రేంజ్‌లో పండిచింది. ఆ సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ రెండో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఈ చిత్రంలో రాములో  రాముల పాటలో పూజా హెగ్డే, అల్లు అర్జున్‌లతో సరి సమానంగా చిందేసింది. ప్రస్తుతం ఈమె ‘విరాట పర్వం’ తో పాటు ‘పాగల్’ చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఈ మూవీలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: