హోమ్ /వార్తలు /సినిమా /

Nithiin : సైలెంట్‌గా నితిన్ కొత్త చిత్రం షురూ.. టైటిల్ ప్రకటన...

Nithiin : సైలెంట్‌గా నితిన్ కొత్త చిత్రం షురూ.. టైటిల్ ప్రకటన...

ఉప్పెన సినిమా కోసం కేవలం 6 లక్షలు మాత్రమే తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కోటి 25 కావాలంటుంది. అయితే అంతకు ముందు కమిటైన సినిమాలకు మాత్రం తక్కువగానే తీసుకుంటుంది కృతి. ఈమె వయసు ప్రస్తుతం 18 ఏళ్లు మాత్రమే. ప్లస్ టూలోనే ఉంది ఈ బ్యూటీ. వరసగా మూడు విజయాలు రావడంతో కృతి శెట్టి టాప్ రేంజ్‌కు వెళ్లిపోయింది.

ఉప్పెన సినిమా కోసం కేవలం 6 లక్షలు మాత్రమే తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కోటి 25 కావాలంటుంది. అయితే అంతకు ముందు కమిటైన సినిమాలకు మాత్రం తక్కువగానే తీసుకుంటుంది కృతి. ఈమె వయసు ప్రస్తుతం 18 ఏళ్లు మాత్రమే. ప్లస్ టూలోనే ఉంది ఈ బ్యూటీ. వరసగా మూడు విజయాలు రావడంతో కృతి శెట్టి టాప్ రేంజ్‌కు వెళ్లిపోయింది.

Nithiin : నితిన్ కృతి శెట్టి జంటగా కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ దర్శకత్వం వహించనున్నారు.

  యువ నటుడు నితిన్.. (Nithiin) ప్రస్తుతం మాస్ట్రో  (Maestro)అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక అది అలా ఉంటే నితిన్ వరుస సినిమాలు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగా నితిన్ తాజాగా తన 31 వ చిత్రాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

  నితిన్ సరసన క్రేజీ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. ఇక ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు మోషన్ పోస్టర్ ద్వారా ఈసినిమా టైటిల్ ను రివీల్ చేయనునుంది చిత్రబృందం.

  ఈ సినిమాతో పాటు నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాను ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ఓ సినిమాను నితిన్ చేయనున్నాడని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి విషయానికి వస్తే.. తెలుగు ఇండస్ట్రీలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం.

  హీరోలను స్టైలీష్‌గా చూపించడంలో ఆయన సిద్ధహస్తుడు. చూడాలి మరి నితిన్‌ను ఎలా చూపించబోతున్నారో.. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి (Akhil Akkineni) అఖిల్ అక్కినేనితో ఒక స్పై థ్రిల్లర్‌ను చేస్తున్నారు. ఏజెంట్ పేరుతో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

  ఈ సినిమా తర్వాత బహుశా నితిన్ సినిమా ఉండోచ్చు. ఈ రెండు సినిమాల తర్వాత సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు చాలా సమయం ఉండడంతో మధ్యలో ఇలా నితిన్ సినిమాను తెరకెక్కించనున్నాడు సురేందర్ రెడ్డి.

  ఇక నితిన్ మాస్ట్రో విషయానికి వస్తే.. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీల్లో విడుదలకానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 17న హాట్ స్టార్ స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.32 కోట్ల మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించనున్నారు.

  నితిన్ సరసన నభా నటేష్ నటించింది. ఇక ఒరిజినల్‌లో టబు చేసిన పాత్రలో తమన్నా నటించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Nithiin, Tollywood news

  ఉత్తమ కథలు