Home /News /movies /

NITIIN NEW MOVIE MACHERLA NIYOJAKAVARGAM TO HAVE TWO HEROINES HERE ARE THE DETAILS SR

Nithiin : మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరి భామలతో నితిన్ రొమాన్స్...

Macherla Niyojakavargam Photo : Twitter

Macherla Niyojakavargam Photo : Twitter

Nithiin : మాస్ట్రో తర్వాత నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే మరో సినిమాను మొదలు పెట్టారు. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి (Krithi Shetty ) నటించనుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటించనుందని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ (Maestro)చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే నితిన్‌ హీరోగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (macherla niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్నాయి. ప్రస్తుతం స్క్రిప్టు పనులను చేసుకుంటున్న చిత్రబృందం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్ చేస్తోంది. ఇక తాజాగా వస్తోన్నసమాచారం మేరకు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

  ఈ విషయంలో ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించగా నిధి అగర్వాల్ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయలో త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు మహతి స్వరసాగర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

  Vijay Devarakonda : లవ్ స్టోరి సినిమాతో ప్రారంభం కానున్న విజయ్ దేవరకొండ మల్టీఫ్లెక్స్‌..

  ఇక నితిన్ మాస్ట్రో విషయానికి వస్తే.. హీరో నితిన్ మాస్ట్రో (Nithiin Maestro)అనే థ్రిల్లర్‌ హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది. ఈ తెలుగు సినిమాకు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌తో పాటు సాంగ్స్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. కాగా రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థుతుల మధ్య ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్‌ (Nithiin Maestro on Hotstar ) అవుతోంది.

  ఇక ఈ చిత్రం లో డార్క్ హ్యూమర్ నచ్చడం తో కొన్ని మార్పులు చేసి, ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకులు ఇప్పటికే తెలిపారు. ఈ చిత్రం క్లైమాక్స్, లవ్ ట్రాక్ మరియు నితిన్ (Nithiin) పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

  Allu Arjun : అల వైకుంఠపురములో సినిమాకు ఐదు అవార్డులు.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్..

  ఇక 'మాస్ట్రో' డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ (Hotstar )  సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.35 కోట్ల మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించనున్నారు. నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించింది.

  ఇక ఒరిజినల్‌ అంధధున్‌‌లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. మాస్ట్రోను నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Krithi shetty, Nithiin, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు