NITIIN MACHERLA NIYOJAKAVARGAM PAWAN KALYAN HARI HARA VEERAMALLU TO BE RELEASE ON SAME DAY SR
Nithiin | Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో పోటీకి రెడీ అంటోన్న నితిన్.. చివరి వరకు ఉంటారా...
Nithiin and Pawan Kalyan Photo : Twitter
Nithiin | Pawan Kalyan : యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (macherla niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది.
యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (macherla niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. మాచర్ల నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29, 2022న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఎన్నికల ఆఫీసర్‌గా నితిన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక విశేషం ఏమంటే అదే రోజునా ఏంతో ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కూడా విడుదల కానుంది. దీంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి నితిన్ చివరి వరకు పోటీలో ఉండి అదే రోజునా విడుదల చేస్తారా.. లేక తప్పుకుంటారా...
ఇక ఇప్పటికి 50 శాతం చిత్రీకరణ జరుపుకుంది హరిహర వీరమల్లు. ఏ. ఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. సినిమా కంప్లీట్ గా 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని పవన్ పాత్ర కూడా రాబిన్ హుడ్ తరహాలో చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను ఆధారంగా చేసుకొని కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు క్రిష్ తెలియజేశాడు.. ఇప్పటివరకు తెలుగులోనే ఇలాంటి సినిమాను ప్రేక్షకులు చూడలేదని కూడా ఈ దర్శకుడు నమ్మకంగా తెలియజేశాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తోంది చిత్రబృందం. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారు.
ఇక నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్ చేస్తున్నారు. ఇక తాజాగా వస్తోన్నసమాచారం మేరకు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనుందని టాక్.
ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక నితిన్ హిందీ చిత్రం అంధాదున్ రీమేక్‌ను తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. ఈ తెలుగు సినిమాకు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించింది. నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించారు.
ఇక ఒరిజినల్ అంధధున్లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.