Home /News /movies /

NITHYA MENON REVEALS THE REASON FOR HER INJURED LEG SB

Nithya Menon: నడవలేని స్థితిలో నిత్యా మీనన్... ఆమె కాలికి ఏమైంది ?

నిత్యా మీనన్ (Nithya Menen)

నిత్యా మీనన్ (Nithya Menen)

ఆమె ఒక స్టిక్ పట్టుకొని మరో ఇద్దరి సహాయంతో నడుచుకుంటూ స్టేజ్ పైకి వెళ్ళింది.. నిత్య ను అలా చూసి అందరూ ఒక్కసారిగా కంగారుపడ్డారు. నిత్యాకి ఏమైందని టెన్షన్ పడ్డారు.

    నిత్య మీనన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. మలయాళ కుట్టి నిత్యామీనన్ తెలుగులో వరుసగా ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. చివరిగా మనకు భీమ్లా నాయక్, స్కైల్యాబ్ సినిమాల్లో నిత్యా కనిపించింది. ఇకపోతే తాజాగా నిత్యా మీనన్ ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఇందుకు సంబంధించి.. హైదరాబాదులో నిర్వహించిన మోడ్రన్ లవ్ హైదరాబాద్ సీరీస్ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ కి అందులో నటించిన ఆర్టిస్టులంతా హాజరయ్యారు ఇక అయితే ఈవెంట్లో నిత్యమీనన్ కూడా వచ్చింది.

    అయితే నిత్యా మీనన్‌ను స్టేజ్‌పై చూసిన వారంతా షాక్ తిన్నారు. ఆమె ఒక స్టిక్ పట్టుకొని మరో ఇద్దరి సహాయంతో నడుచుకుంటూ స్టేజ్ పైకి వెళ్ళింది.. నిత్య ను అలా చూసి అందరూ ఒక్కసారిగా కంగారుపడ్డారు. అయితే నిత్యా మీనన్‌ అలా నడవటం చూసి అంతా ప్రమోషన్లలో భాగమే అనుకున్నారు. కానీ.. ఆమె కాలికి నిజంగానే గాయం అయ్యింది. ఇక నిత్యామీనన్ కి ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్న సమయంలోనే నిత్య స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ.. ఈ సిరీస్ లో ఇలాంటి క్యారెక్టర్ లో నేను చేశాను. కానీ ఇప్పుడు నిజంగా ఇలా జరిగింది.. ఇక ఇటీవల ఇంట్లో స్టెప్స్ మీద నుంచి స్లిప్ అయి పడ్డాను. దాంతో ఇలా జరిగింది అంటూ నిత్యామీనన్ వెల్లడించింది.

    ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ సరసన కనిపించి అలరించింది నిత్య. ఇక ఆహ తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇలా సినిమాలు, షోలు, సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది నిత్య మీనన్. తాజాగా నిత్య నటించిన వెబ్ సిరీస్ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ జులై 8 నుంచి అమెజాన్ లో టెలికాస్ట్ కానుంది. అయితే నిత్యా కాలికి దెబ్బ తగిలిన కూడా.. తాను నటించిన సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో తన డెడికేషన్ ని మెచ్చుకుంటున్నారు. నిత్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

    నిత్యా మేనన్‌ కేవలం నటిని కాదు.. ఆమె సింగర్ కూడా. ఆమె పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. నిత్య ఇప్పటివరకు మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది. 8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 17 సంవత్సరాల వయసులో 2006 లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Nithya menon, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు