Nithya Menen : నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆమె ఇటీవల తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించేసింది. కాగా నిత్యా మీనన్ తెలుగులో తాజాగా ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అదే పవన్ కళ్యాణ్ రానా సినిమా పరశురామ కృష్ణమూర్తి. మొన్నటి వరకు కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ఇక ఈ మధ్యే కాస్తా కరోనా కేసులు తగ్గడంతో టాలీవుడ్లో షూటింగ్’లు పుంజుకున్నాయి. లాక్డౌన్ సడలింపు తర్వాత చిత్ర పరిశ్రమ షూటింగ్‌లతో కళకళలాడుతోంది. చిన్న హీరోల నుంచి బడా హీరోలు సెట్లో అడుగుపెట్టి సందడి చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ కూడా ఈ నెల రెండో వారం నుంచి తన మలయాళ రీమేక్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రీకరణలో పాల్గొనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా టాలెంటెడ్ యాక్టర్ నిత్యామీనన్ నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించనప్పటికి ఆమె పవన్‌కు జోడిగా కనిపించనుంది. నిత్యా మీనన్ ఈ నెల 12 నుంచి సెట్లో అడుగుపెట్టనున్నారని తెలిసింది. నిత్యా మీనన్ తెలుగులో నటించిన గుండే జారి గల్లంతయ్యిందే , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించింది.
ఇక నిత్యా మీనన్‌కు పవన్‌తో మొదటి సినిమా. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తైన ఈ సినిమాలో రానా మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు, స్ర్కీన్‌ప్లే త్రివిక్రమ్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగనుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు హరి హర వీరమల్లు అనే సినిమాలోను నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలో షూటింగ్ రిస్టార్ట్ చేయనుంది. ఏ యం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నారు పవన్ కళ్యాణ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan, Rana daggubati, Tollywood news