ఛీ..ఛీ.. నిత్యామీనన్ ఏమిటి పాడు పనులు.. మరోసారి వార్తల్లో నిలిచిన బ్యూటీ..

నిత్య మీనన్ హాట్ ఫోటోస్ (Nithya Menen)

నిత్యా మీనన్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  తన అద్బుత నటనతో  దక్షిణాది ప్రేక్షకులను అలరించింది.తాజాగా ఈమె చేసిన పనితో మరోసారి వార్తల్లో నిలచింది.

  • Share this:
    నిత్యా మీనన్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  తన అద్బుత నటనతో  దక్షిణాది ప్రేక్షకులను అలరించింది.  కాకపోతే ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది ఈ ముద్దుగుమ్మ.  ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన నిత్యా.. ఇప్పుడు జోరు తగ్గించింది. అడపాదడపా అవకాశాలతో కెరీర్ సాగిస్తుంది. ఆ మధ్య దేవరకొండతో "గీత గోవిందం" సినిమాలో అతిథిపాత్రలో నటించింది. రీసెంట్‌గా ఈమె 50 చిత్రాల మైలురాయిని అందుకుంది. గతేడాది ఈమె అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమాలో నటించింది.  కెరీర్ పరంగా డిఫరెంట్ చిత్రాలు చేసే ఈ కేరళ బ్యూటీ.. త్వరలో దర్శకత్వం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇపుడు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లను చేస్తోంది. ఈ క్రమంలోనే ఈమె అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్ ఇన్ టూ ది షాడోస్’ అనే వెబ్ సిరీస్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా నిత్యా మీనన్ వివాస్పద రోల్లో నటించింది. ఈ వెబ్ సీరిస్‌లో నిత్యా మీనన్.. మరో నటితో లిప్‌లాక్ సన్నివేశాలు హీట్ పుట్టిస్తున్నాయి.

    ఈ సన్నివేశాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిత్యామీనన్ ఇలాంటి వివాస్పద పాత్ర చేయడానికి ఎలా అంగీకరించింది అంటూ ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ యూత్ మాత్రం నిత్యామీనన్.. ఈ హాట్ కిస్సింగ్ సన్నివేశాలను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో నిత్యామీనన్ ‘అ’ చిత్రంలో ఇలాంటి వివాదాస్పద లెస్పిబియన్ పాత్రలో నటించింది. ప్రస్తుతం నిత్యామీనన్ తమిళంలో జయలలిత జీవితంపై తెరకెక్కుతోన్న ‘ది ఐరన్ లేడీ’ అనే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: