Pawan Kalyan | Nithya Menen : పవన్‌ కళ్యాణ్‌ రానా చిత్రంలో నిత్యామీనన్‌.. అధికారిక ప్రకటన..

Nithya menen Photo : Twitter

Pawan Kalyan | Nithya Menen : పవన్ కళ్యాణ్ రానా ప్రధాన పాత్రల్లో మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు.

  • Share this:
    పవన్ కళ్యాణ్ రానా ప్రధాన పాత్రల్లో మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తయింది. ఇక తాజాగా ఈ సినిమాలో నిత్యామీనన్ ఎంటర్ అయ్యింది. దీనికి సంబంధించి చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిత్యా మీనన్ ఈసినిమాలో పవన్ సరసన.. ఆయన భార్యగా నటించనుందని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


    పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు హరి హర వీరమల్లు అనే సినిమాలోను నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలో షూటింగ్ రిస్టార్ట్ చేయనుంది. ఏ యం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నారు పవన్ కళ్యాణ్.
    Published by:Suresh Rachamalla
    First published: