హోమ్ /వార్తలు /movies /

Nithiin : ఆగస్టులో నితిన్ వక్కంతం వంశీ కొత్త సినిమా షురూ.. పక్కా ప్లానింగ్‌తో ముందుకు..

Nithiin : ఆగస్టులో నితిన్ వక్కంతం వంశీ కొత్త సినిమా షురూ.. పక్కా ప్లానింగ్‌తో ముందుకు..

Nithiin : నితిన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన మరో సినిమాను సెట్స్‌పై తీసుకువెళ్లడానికి రెడీ అయ్యారు.

Nithiin : నితిన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన మరో సినిమాను సెట్స్‌పై తీసుకువెళ్లడానికి రెడీ అయ్యారు.

Nithiin : నితిన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన మరో సినిమాను సెట్స్‌పై తీసుకువెళ్లడానికి రెడీ అయ్యారు.

  నితిన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. రంగ్ దే సినిమా తర్వాత నితిన్ హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలూ ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇంకొక వారం రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. అది జరిగితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తైనట్టేనట. ఆ పార్ట్ కరోనా ఉధృతి కాస్తా తగ్గాక తిరిగి మొదలుకానుంది. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నటిస్తోంది. మరోకీలక పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ 11న విడుదల కష్టమే. అది అలా ఉంటే నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. వక్కంతం వంశీ మొదటి సినిమా ‘నా పేరు సూర్య’ చిత్రం అనుకున్నంతగా అలరించలేదు. ఆ సినిమా తర్వాత వంశీ డైరెక్ట్ చేయనున్న సినిమా ఇదే. మొదటి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వక్కంతం వంశీ కసిగా ఈ సినిమా కథను తయారు చేసుకున్నారట. లాంగ్ గ్యాప్ తీసుకుని పర్ఫెక్ట్ కథను సిద్ధం చేసుకుని నితిన్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందో..

  కరోనా వల్ల లభించిన ఈ విరామ సమయంలో వక్కంతం వంశీ బౌండ్‌ స్ర్కిప్ట్‌ సిద్ధం చేశారట. 'ఠాగూర్‌' మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నితిన్ ఇటీవల రంగ్ దే అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వచ్చారు. ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పెద్దగా ఆకట్టకోలేకపోయింది. ఇక ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన మరో సినిమా చెక్. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వం వహించారు.

  check movie,check movie collections,check movie review,nithiin new movie check in hindi,check 1st day box office collection,check movie first day collections,check film box office collection,check movie first day collections report,check total box office collection,nithin check movie trailer,nithin check movie official trailer,నితిన్,నితిన్ చెక్ కలెక్షన్స్,నితిన్ బాక్సాఫీస్ కలెక్షన్స్,నితిన్ ఫస్ట్ డే కలెక్షన్స్
  నితిన్ చెక్ సినిమా (Nithiin Check movie)

  కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ చేయనున్నారు నితిన్. ఈ సినిమాకు పవర్ పేట అనే టైటిల్ ను పరిశీలిస్తోంది చిత్రబృందం. వెంకీ కుడుములతో కూడా నితిన్ మరో సినిమా చేయనున్నారని తెలిసింది. అంతేకాదు ఇప్పటికే నితిన్ కోసం పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట వెంకీ. ఈ కథ నితిన్ కి కూడా బాగా నచ్చిందట. చూడాలి మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో భీష్మ వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

  First published:

  ఉత్తమ కథలు